WhatsApp End Support : అక్టోబర్ తర్వాత ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp End Support : కొత్త ఆండ్రాయిడ్ డివైజ్‌ల కోసం కొత్త ఫీచర్లను అందించే దిశగా వాట్సాప్ దృష్టిసారిస్తోంది. Apple, Samsung, Sony, ఇతర బ్రాండ్‌ల నుంచి 25 కన్నా ఎక్కువ పాత ఫోన్ మోడల్‌లకు వాట్సాప్ సపోర్టు అందిస్తుంది.

WhatsApp End Support : అక్టోబర్ తర్వాత ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

WhatsApp will end support for select Android phones after October,

WhatsApp End Support : వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్లలో అక్టోబర్ తర్వాత నుంచి వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. అక్టోబర్ 24, 2023 నుంచి నిర్దిష్ట పాత ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రకారం.. ఆపరేటింగ్ సిస్టమ్ ఇటీవలి వెర్షన్‌లలో యూజర్ల కోసం కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని కంపెనీ భావిస్తోంది.

అలాగే లేటెస్ట్ ఫీచర్లను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టనుంది. సెక్యూరిటీ ఫీచర్లు, కొత్త టెక్నాలజీతో పాటు కొత్త ఫీచర్లపై దృష్టిపెట్టేందుకు (Android OS) వెర్షన్ 4.1, అంతకంటే పాత వాటిపై రన్ అయ్యే 25కు పైగా పాత స్మార్ట్‌ఫోన్ మోడళ్లకు సపోర్టును నిలిపివేయనుంది. పాత ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కూడా లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్ నిలిచిపోనున్నాయి.

వాట్సాప్ సపోర్టు ఇవ్వని డివైజ్‌ల జాబితా :
పాత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని పాతబడిన స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి..

* Samsung Galaxy S2
* Nexus 7
* iPhone 5
* iPhone 5c
* Archos 53 Platinum
* Grand S Flex ZTE
* Grand X Quad V987 ZTE
* HTC Desire 500
* Huawei Ascend D
* Huawei Ascend D1
* HTC One
* Sony Xperia Z
* LG Optimus G Pro
* Samsung Galaxy Nexus
* HTC Sensation
* Motorola Droid Razr
* Sony Xperia S2
* Motorola Xoom
* Samsung Galaxy Tab 10.1
* Asus Eee Pad Transformer
* Acer Iconia Tab A5003
* Samsung Galaxy S
* HTC Desire HD
* LG Optimus 2X
* Sony Ericsson Xperia Arc3

అయితే, సపోర్టును ముగించే ముందు వాట్సాప్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. వాట్సాప్ వినియోగాన్ని కొనసాగించడానికి యూజర్ల డివైజ్ అప్‌గ్రేడ్ చేయమని గుర్తు చేస్తోంది. అక్టోబర్ 24 తర్వాత వాట్సాప్ డెవలపర్లు టెక్నికల్ సపోర్ట్, అప్‌డేట్‌లను అందించడం నిలిపివేస్తారు. ఇకపై ఆటోమేటిక్ అప్‌డేట్‌లు, ప్యాచ్‌లు, సెక్యూరిటీ ఫిక్స్‌లు, బగ్ పరిష్కారాలు లేదా కొత్త ఫీచర్‌లను అందుకోలేవు. అప్‌డేట్‌లు అందకపోతే.. OS ఇప్పటికీ పనిచేస్తుంది. కానీ, హ్యాకర్లు, మాల్వేర్‌లకు డివైజ్ టార్గెట్ అవుతుంది.

WhatsApp will end support for select Android phones after October,

WhatsApp end support for select Android phones

ముఖ్యంగా, వాట్సాప్‌లో ఇకపై సపోర్ట్ చేయని చాలా ఫోన్‌లు ఈ రోజు విస్తృతంగా ఉపయోగించని పాత మోడళ్లే ఉన్నాయి. అయినప్పటికీ, మీరు ఇప్పటికీ ఈ ఫోన్‌లలో ఒకదానిని కలిగి ఉన్నట్లయితే.. కొత్త డివైజ్‌కు వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే.. వాట్సాప్‌తో సహా చాలా యాప్‌లు కాలం చెల్లిన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్టు అందించడం లేదు.

డివైజ్ OSని ఎలా చెక్ చేయాలంటే? :
అదే సమయంలో, మీ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతున్న (Android OS) వెర్షన్‌ను చెక్ చేయాలనుకుంటే.. ప్రత్యేకంగా Android OS వెర్షన్ 4.1 లేదా అంతకంటే పాత వాటిని ఉపయోగించే డివైజ్‌ల కోసం ఈ సమాచారాన్ని డివైజ్ సెట్టింగ్‌ల మెనులో చెక్ చేయవచ్చు. అలా చేయడానికి, Settings > About Phone > Software Update నావిగేట్ చేయండి. మీ Android ‘వెర్షన్’ కేటగిరీ కిందలిస్టును చెక్ చేసుకోవచ్చు.