B. Mohan Reddy – Bithiri Sathi : బీఆర్ఎస్ లోకి బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి, ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి

ముదిరాజ్ సామాజిక వర్గంతోపాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కోరారు.

B. Mohan Reddy – Bithiri Sathi : బీఆర్ఎస్ లోకి బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి, ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి

B. Mohan Reddy - Bithiri Sathi

B. Mohan Reddy – Bithiri Sathi : ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ, పీఆర్ టీయూ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో కొనసాగుతున్న ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గురువారం రాత్రి మంత్రి కేటీఆర్ సమక్షంలో బి.మోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. విద్యారంగ, ఉపాధ్యాయ అంశాలపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో కలిసి పని చేసేందుకు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు పేర్కొన్నారు.

అలాగే ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు సమాచారం. త్వరలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీఆర్ఎస్, తాజాగా బిత్తిరి సత్తితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావుతో బిత్తిరి సత్తి గురువారం ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు.

Komatireddy : కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ముదిరాజ్ సామాజిక వర్గంతోపాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కోరారు. ఈ మేరకు బీఆర్ఎస్ లో చేరికకు అంగీకరించినట్లు బిత్తిరి సత్తి మీడియాకు వెల్లడించారు.

అంతేకాకుండా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మరి కొంతమంది కీలక నేతలు కూడా త్వరలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీకి చెందిన కీలక నేత కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.