KTR : అబద్దాల అమిత్ షా పార్టీకి గుణపాఠం తప్పదు, 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు- కేటీఆర్

అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడాడో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవు. KTR

KTR Slams Amit Shah (Photo : Twitter X)

KTR Slams Amit Shah : ఆదిలాబాద్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ స్పీచ్ పై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. అమిత్ షా చేసిన ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. అబద్దాల అమిత్ షా అంటూ ఎదురుదాడికి దిగారు. అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలే అని ధ్వజమెత్తారు. అమిత్ షా, మోదీ ఎన్ని అబద్ధాలు ఆడినా తెలంగాణలో బీజేపీకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఈ ఎన్నికల్లోనూ 110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం అని కేటీఆర్ జోస్యం చెప్పారు.

”పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడాడో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి. ప్రజల ఆశీర్వాదంతో పదే పదే గెలుస్తున్న పార్టీలను, నాయకులను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదు.

Also Read : టీడీపీ సీటులో కారు జోరు చూపించగలదా.. హస్తవాసి ఎలా ఉంది?

పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క విద్యాసంస్థను ఇవ్వని పార్టీ బీజేపీ. మా కార్ స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది. మీ పార్టీ స్టీరింగే అదానీ చేతిలో ఉంది. తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానం అంటూ అమిత్ షా పచ్చి అబద్ధం ఆడారు. రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకే అమిత్ షా అబద్ధాలు చెప్పారు” అని ఫైర్ అయ్యారు కేటీఆర్.

ఆదిలాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఈ పదేళ్లలో కేటీఆర్ ని సీఎం చేయాలనే ఆలోచనలోనే గడిపేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ అధికారికంలోకి రాగానే సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. కేంద్ర ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యానికి రాష్ట్రం నిధులు కేటాయించకపోవడమే కారణమని ఆరోపించారు.

Also Read : హోరాహోరీగా సూర్యాపేట రాజకీయం.. కాంగ్రెస్ తలరాత మారుతుందా?

పసుపు బోర్డు ద్వారా ఎగుమతులు పెరగనున్నాయని.. కృష్ణ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణ ప్రజల నీటి సమస్యను మోదీ తీర్చారని షా తెలిపారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మోదీదే అంటూ ప్రశంసించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు, అవినీతి, నిరుద్యోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ కార్ స్టీరింగ్ ఒవైసీ దగ్గర ఉందని ఆరోపించారు అమిత్ షా.

ట్రెండింగ్ వార్తలు