Hyderabad Metro: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం.. డిసెంబర్ 9న శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ మహా నగరంలో రెండో దశ మెట్రో నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Hyderabad Metro: హైదరాబాద్ మహా నగరంలో మరో దశ మెట్రో నిర్మాణం ప్రారంభం కాబోతుంది. త్వరలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మాణం జరగబోతుంది. ఎక్స్‌ప్రెస్‌ మెట్రో పేరుతో రానున్న ఈ నిర్మాణానికి డిసెంబర్ 9న తెలంగాణ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.

Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూ.. కిడ్నీ దానం చేస్తున్న లాలూ కూతురు

ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొత్త మెట్రో ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు. నగరంలోని మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఈ నిర్మాణం జరుగుతుంది. దీని మొత్తం పొడవు 31 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6,250 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ మెట్రో నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

 

ట్రెండింగ్ వార్తలు