Telangana : తోపుడు బండిపై మద్యం అమ్మకాలు .. ఎగబడి కొనేస్తున్న మందుబాబులు

తోపుడు బళ్లపై కూరగాయాలు అమ్మటం చూశాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా తోపుడు బండి వీధి వీధి తిరుగుతు మద్యం బాటిల్స్ అమ్ముతున్నాడు. రండి బాబు రండీ మీకు కావాల్సిన బ్రాండ్ సరమైన ధరకే అంటూ పిలిచి మరీ అమ్ముతున్నాడు. దీంతో మందుబాబులు ఎగబడి మరీ కొనేసుకుంటున్నారు.

Telangana : తోపుడు బండిపై మద్యం అమ్మకాలు .. ఎగబడి కొనేస్తున్న మందుబాబులు

Liquor Selling On vegetable cart

Liquor Selling On vegetable cart : బెండకాయలు, బీరకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు అంటూ వీధుల్లో కూరగాయాలు తోపుడు బళ్లపై అమ్మటం చూశాం. ఆకుకూరలు, కూరగాయలు వంటివి ఇళ్లముందుకే తోపుడు బళ్ల మీద కూరగాయల్ని కొనుక్కుంటాం. కానీ తెలంగాణలోని సిరిసిల్లలో మాత్రం ఓ వ్యక్తి తోపుడు బండిపై మద్యం బాటిళ్లను కూరగాయల్లా అమ్మేస్తున్నాడు. పైగా ‘‘బ్రాందీ, విస్కీ, రమ్ము అంటూ పిలిచి మరీ అమ్ముతున్నాడు. రండి బాబు రండీ మీ ఇంటి ముందుకే ‘మందు’ బండి బాటిల్స్ తో సహా వచ్చేసింది. సరసమైన ధరలకే మీకు కావాల్సిన బ్రాండ్ కొనుక్కోండి బాబు రండి బాబు రండి’’ అంటూ పిలిచి మరీ అమ్మేస్తున్నాడు.

తోపుడు బండిపై ఇలా కూరగాయలకు బదులు మందు బాటిల్స్ అమ్ముతున్న ఆ వ్యాపారిని చూసి కొంతమంది ఆశ్చర్యపోతుంటే..మరికొంతమంది ‘‘ఏందిరాబాబు మరీ ఇంత డోర్ డెలివరీలా’’ అంటూ నోరెళ్లబెడుతున్నారు. మందుబాబులకు మాత్రం ఈ తోపుడు బండిపై మద్యం అమ్మటం బాగా నచ్చేసినట్లుంది…చక్కగా బండి చుట్టు చేరి వారి కావాల్సిన మందు చక్కగా కొనేసుకుంటున్నారు.

సాధారణంగా వీధిలోకి తోపుడు బండిపై కూరగాయలు అమ్మకానికి వస్తే ఆ చుట్టుపక్కల ఆడవారు బండి చుట్టు చేరి ‘‘బెండకాలు ఎంతకిస్తున్నావేంటీ…మరీ బీరకాయలు ఎంత..? పచ్చి మిర్చి మరీ ఇంత రేటా..?కాస్త తగ్గించుకోరాదు’’అంటూ బేరాలు ఆడటం చూస్తుంటాం. కానీ మంత్రి కేటీఆర్ (Minister KTR)నియోజక వర్గం అయిన సిరిసిల్లాలో (Rajanna Sircilla Constituency)మాత్రం ‘నా రూటే సెపరేటు అంటు ఓ వ్యక్తి తోపుడు బండిపై మద్యం బాటిల్స్ అమ్మటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సిరిసిల్లాలోని శాంతి నగర బజార్ లో ఓ చిరు వ్యాపారం చక్కగా మద్యం బాటిల్స్ ని కూరగాయలు పెట్టుకున్నట్లుగా పెట్టుకుని వీధి వీధి తిరుగుతు అమ్మేస్తున్నాడు.

ఈ వ్యాపారి పేరు సోమిశెట్టి దశరథం (Somishetty Dasharadham) అన్నట్లుగా తెలుస్తోంది. ఇతను తోపుడు బండి పై ఓవైపు కూరగాయలు, మరోవైపు బీరు (Beer), వీస్కీ బాటిల్ పెట్టుకుని పట్టణ వీధుల్లో అమ్ముతున్నాడు. కూరగాయలు, బీర్లు, విస్కీ బాటిళ్లు అంటూ కేకలు వేస్తూ అమ్మకాలు చేస్తుండడం తో చూసినవారంతా నోరెళ్లబెడుతున్నారు. మరి మీకు కూడా ఓ లుక్కేయండీ ..