Anil Kumar Yadav: తండ్రి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్న కొడుకు.. ముషిరాబాద్ అసెంబ్లీ బరిలో అంజన్న!

పిల్లలకు పదవుల కోసం తండ్రులు కొట్లాడుతుంటే.. తండ్రి కోసం త్యాగం చేశాడు ఈ కుమారుడు.. ఐతే ఇందులో ఓ ట్విస్టు కూడా ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఎవరా తండ్రీ కొడుకులు?

anil kumar yadav sacrifice musheerabad seat for his father

Congress Leader Anil Kumar Yadav: వారసత్వ రాజకీయాలు అత్యంత కామన్‌గా ఉన్న కాలమిది.. ఇంట్లో ఒకరు పెద్ద పదవిలో ఉంటే ఆటోమెటిగ్గా మిగతావారు పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయిపోతారు. తండ్రి ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో ఉంటే పిల్లలు, తోడబుట్టినవారు ఇలా ఎవరో ఒకరు ఇంకో పదవి కోసం వెంపర్లాడతారు. కానీ, తెలంగాణ ఎన్నికల సిత్రంలో రోటీన్‌కు భిన్నంగా ఓ ఫ్యామిలీ స్టోరీ నడుస్తోంది. రాజకీయాల్లో సీనియర్ అయిన తండ్రి కోసం కుమారుడు అసెంబ్లీ బరి నుంచి తప్పుకోవడమే ఇక్కడ ట్విస్ట్.. పిల్లలకు పదవుల కోసం తండ్రులు కొట్లాడుతుంటే.. తండ్రి కోసం త్యాగం చేశాడు ఈ కుమారుడు.. ఐతే ఇందులో ఓ ట్విస్టు కూడా ఉందని చెబుతున్నారు. ఇంతకీ ఎవరా తండ్రీ కొడుకులు.. ఏమా కథ?

తెలంగాణ పాలిటిక్స్‌లో ఇదో డిఫరెంట్ స్టోరీ.. తండ్రి కోసం తన ఎమ్మెల్యే సీటునే త్యాగం చేశాడు ఓ కుమారుడు.. గెలుపు పక్కా అనుకుంటున్న చోట.. తాను సైడ్ తీసుకుని… తండ్రికి రెడ్ కార్పెట్ వేశాడు. ఆ తండ్రి కొడుకులు మరేవరె కాదు సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఆయన కుమారుడు డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన అంజన్‌కుమార్ ఈ సారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తుండటంతో అనిల్‌కుమార్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో వన్‌ఫ్యామిలీ.. వన్ టికెట్ ఫార్ములా అమలు అవుతోంది.. తండ్రి కొడుకుల్లో ఎవరో ఒకరికే టికెట్ ఇస్తామని పార్టీ కండీషన్ పెట్టడంతో తాను పక్కకు తప్పుకుని తండ్రికి లైన్‌క్లియర్ చేశారు అనిల్‌ కుమార్‌యాదవ్. గత ఎన్నికల్లో ముషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనిల్‌కుమార్ ఓటమి చవిచూశారు. ఈ సారి అదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇదే సమయంలో తండ్రి అంజన్‌కుమార్ యాదవ్ సైతం పోటీకి సై అనడంతో అనిల్‌కుమార్ పోటీ ప్రతిపాదన విరమించుకోవాల్సివచ్చింది. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా బాగా యాక్టీవ్‌గా ఉన్న అనిల్‌కుమార్ యాదవ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంతో ప్రయత్నించినా.. తండ్రి రూపంలోనే అవాంతరం ఎదురవడం.. పార్టీ కండీషన్ ప్రకారం ఒకే టికెట్ దక్కే అవకాశం ఉండటంతో నాన్నకు ప్రేమతో ముషిరాబాద్ సీటును అప్పగించేశారు.

Also Read: మీడియాలో వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు నిజం కావు, ఆ అధికారులను వదిలిపెట్టం- రేవంత్ రెడ్డి

ముషిరాబాద్ ఎమ్మెల్యే టికెట్ అంజన్‌కుమార్‌ యాదవ్‌కు ఇంకా ఖరారు చేయకపోయినా.. పార్టీలో ఆయన సీనియార్టీ.. సమర్థత దృష్ట్యా ఇంకొకరికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు.. అంజన్న పోటీ చేయడం దాదాపు ఫైనల్ అంటున్నారు. ఐతే ఎంపీగా పోటీచేయాల్సిన అంజన్న సడన్‌గా అసెంబ్లీపై మనసు పారేసుకోడానికి పెద్ద కారణమే ఉందంటున్నారు పరిశీలకులు. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేలా ఉంద‌ని భావిస్తున్న అంజన్‌కుమార్ యాదవ్.. తాను ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి దక్కించుకోవచ్చని భావిస్తున్నారట.

Also Read: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డికి కీలక బాధ్యతలు.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్

హైద‌రాబాద్‌లో సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌గా త‌న‌కే అవ‌కాశం ఉంటుంద‌ని గట్టి నమ్మకంతో ఉన్న అంజన్న ఎమ్మెల్యే గిరీపై ఆశలు పెంచుకుంటున్నారు. తాను కాకుండా కుమారుడు అనిల్‌ను ఎమ్మెల్యే చేస్తే జూనియర్ కింద భావించి మంత్రి పదవి ఇవ్వకుండా సైడ్ చేసేస్తారని అనుమానిస్తున్న అంజన్నే స్వయంగా రంగంలోకి దిగుతున్నారట.. ఇది నాన్నకు ప్రేమతో స్టోరీలో అసలు రహస్యమని తెలుసుకుని కాంగ్రెస్ పెద్దలు కూడా ఔరా! అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు