CM KCR: ఆ రెండు ఎన్నికల్లో సక్సెస్.. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న కేసీఆర్‌!

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెంటిమెంట్ ను బలంగా నమ్ముతారు. తాజాగా ఎన్నికల ప్రచారాన్ని కూడా సెంటిమెంట్ ప్రకారమే ప్రారంభిస్తున్నారు గులాబీ బాస్.

why telangana cm kcr follows husnabad sentiment?

KCR Sentiment: తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌కు సెంటిమెంట్ కూడా ఎక్కువే.. నెంబర్ సిక్స్‌ను లక్కీ నెంబర్‌గా భావించే గులాబీబాస్.. ప్రతి ఎన్నికల్లోనూ ప్రచారం స్టార్ట్ చేయడానికి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు. ఈశాన్యం సెంటిమెంట్.. హుస్నాబాద్ నుంచి ప్రచారం చేస్తే గెలుపు గ్యారెంటీ అనే నమ్మకం బలంగా ఏర్పడటంతో ఈ సారి కూడా హుస్నాబాద్‌ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ఆరంభిస్తున్నారు సీఎం.. అసలు సీఎం కేసీఆర్‌కు ఎందుకంత సెంటిమెంట్..? హుస్నాబాద్ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజాశీర్వాద సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది బీఆర్‌ఎస్ పార్టీ. మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా ఈ ఎన్నికల శంఖారావ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీగా జనసమీకరణతో బల ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. 2014, 2018 ఎన్నికల సందర్భంగా హుస్సాబాద్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఆ రెండు ఎన్నికల్లో సక్సెస్ అందుకోవడంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావటానికి అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు.

రాష్ట్రంలో హుస్నాబాద్ నియెజకవర్గం ఈశాన్య దిక్కున ఉంటుంది. అందుకే హుస్నాబాద్‌ను కలిసొచ్చే ప్రాంతంగా భావిస్తున్నారు సీఎం కేసీఆర్. ప్రతి ఎన్నికల్లోనూ తొలి సభను ఇక్కడే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించే సభకు ఎస్.పోతారం గ్రామ సమీపంలో మైదానం ఎంపిక చేశారు. 15న సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుండగా… అదే రోజు ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బీ ఫాంలు అందజేస్తారని చెబుతున్నారు. అప్పుడే మ్యానిఫెస్టోను విడుదల చేసి హుస్నాబాద్ బయల్దేరతారు. ఇక రెండో సభను ఈ నెల 17న సిద్దిపేటలో నిర్వహించనున్నారు.

Also Read: తండ్రి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్న కొడుకు.. ముషిరాబాద్ అసెంబ్లీ బరిలో అంజన్న!

ప్రజాశీర్వాద సభ కోసం హుస్నాబాద్ ఎలాగైతే సెంటిమెంట్ గా కొనసాగుతుందో.. నామినేషన్లు వేసే రోజున కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు సీఎం కేసీఆర్. వచ్చే నెల 9న సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను పూజించి అనంతరం గజ్వేల్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు సీఎం. ఆ తరువాత అక్కడ నిర్వహించే సభలో పాల్గొంటారని బీఆర్‌ఎస్ వర్గాల సమాచారం.

Also Read: అబద్దాల అమిత్ షా పార్టీకి గుణపాఠం తప్పదు, 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు- కేటీఆర్

ఎన్నికల శంఖారావం పూరించే ప్రజాశ్వీరాద సభపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. ఇటీవల నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ఇంతవరకు స్పందించలేదు సీఎం.. ప్రజాశ్వీర సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఏమైనా ఇస్తారా? అన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం నాటి విషయాలను రహస్యంగా వ్యాఖ్యానించిన ప్రధాని.. సీఎం కేసీఆర్‌పైనా.. బీఆర్‌ఎస్ పార్టీపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని కామెంట్లపై బీఆర్‌ఎస్ నేతలు అంతా స్పందించినా.. సీఎం మాత్రం ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు చెప్పలేదు. దీంతో కేసీఆర్ బహిరంగ సభపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు