Tree Bike : పొడవైన చెట్లపైకి ఎక్కే ట్రీ బైక్ ను ఆవిష్కరించిన కర్ణాటక వాసి , దీని ధర ఎంతో తెలుసా !

పండ్ల కోతకు అవసరమైన కూలీలను ఉపయోగించటం వారికి అధిక మొత్తంలో కూలి డబ్బులు చెల్లించటం రైతులకు పెద్ద సవాలుగా మారిన తరుణంలో ఈ ట్రీ బైక్ రైతులకు ఒక వరమనే చెప్పాలి. ఈ పరికరాన్ని కొనుగోలు చేయాలనుకునే రైతులకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 43,000 సబ్సిడీని అందిస్తుంది.,

tree bike

Tree Bike : పొడవైన, నిటారుగా ఉండి ఎత్తుగా పెరిగే కొబ్బరి చెట్లపైకి ఎక్కి కొబ్బరి గెలలను తెంపటం చాలా కష్టం. రైతులు కష్టాన్ని గమనించిన కర్నాటకకు చెందిన కోమలే గణపతి భట్ అనే రైతు దీనికి తరోణోపాయం ఆలోచించాడు. 2019లో ఒక పరికరాన్ని రూపొందించాడు, ఇది కొబ్బరి చెట్టుపైకి త్వరగా ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరం అప్పట్లో వ్యాపార దిగ్గజం మరియు మహీంద్రా గ్రూప్ చైర్మన్ శ్రీ ఆనంద్ మహీంద్రా దృష్టిని సైతం ఆకర్షించింది.

ఆ తర్వాత కాలంలో కోమలే గణపతి భట్ ఈ ‘ట్రీ బైక్’ని రూపొందించడంతో తనపనైపోయిందని కూర్చోకుండా దానిని సాంకేతికంగా మరింత మెరుగుపరచటానికి కొత్త మార్గాలను అన్వేషించసాగాడు. ఇందుకోసం అనేక విధాలుగా ప్రయత్నాలు చేయసాగాడు. 51 ఏళ్ల వయస్సులో, అతను చేపట్టిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఆయన ప్రయత్నం ఆవిర్భవించిన కొత్త ఆవిష్కరణ రైతులకు ఒక వరంగా మారింది.

TreeClimbingScooter

ప్రస్తుతం కోమలే గణపతి భట్ రూపొందించిన ఈ కొత్త ‘ట్రీ బైక్’ 45 కిలోల బరువుంది. ట్రాలీతో సులభంగా రవాణా చేయవచ్చు. ట్రీ బైక్ వాహనం పెట్రోల్‌తో నడుస్తుంది. కేవలం 1 లీటర్ పెట్రోల్‌తో కనీసం 70 నుండి 80 చెట్లను ఎక్కవచ్చు. 5 నుండి 15 అంగుళాల మందం ఉన్న చెట్లపై బైక్‌ను ఉపయోగించవచ్చు.

ఈ ట్రీ బైక్ లో ఆశ్చర్యకరమైన , రైతులకు ప్రయోజనకరమైన విషయం ఏమిటంటే ఇది 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. కొబ్బరి చెట్లతో పాటు, మామిడి , పనస చెట్ల పైకి ఎక్కేందుకు దీనిని సులభంగా ఉపయోగించవచ్చు.

TreeClimbing Scooter

పండ్ల కోతకు అవసరమైన కూలీలను ఉపయోగించటం వారికి అధిక మొత్తంలో కూలి డబ్బులు చెల్లించటం రైతులకు పెద్ద సవాలుగా మారిన తరుణంలో ఈ ట్రీ బైక్ రైతులకు ఒక వరమనే చెప్పాలి. ఈ పరికరాన్ని కొనుగోలు చేయాలనుకునే రైతులకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 43,000 సబ్సిడీని అందిస్తుంది., ఈ పరికరం మొత్తం ఖర్చు రూ. 1.12 లక్షలకు తగ్గింది.

ట్రీ బైక్ ఆపరేషన్ చాలా సులభమని దీనిని తయారు చేసిన కోమలే గణపతి భట్ చెబుతున్నారు. మహిళలు మరియు పిల్లలు సైతం ఎవరి సహాయం లేకుండానే ఒంటరిగా ఉపయోగించవచ్చని మిస్టర్ భట్ అంటున్నారు.