BAJRA CROP : సరైన యాజమాన్య పద్దతులు అనుసరిస్తే సజ్జపంట లో అధిక దిగుబడులు సాధ్యమే!

పంటకు ఎకరానికి 35 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 15 కిలోల పొటాష్‌ను ఇచ్చు ఎరువులను వేయాలి. నత్రజనిని మాత్రం రెండు దఫాలుగా, సగభాగం విత్తేటప్పుడు. మిగిలిన సగభాగం విత్తిన 25-30. రోజుల వయస్సు మొక్కలకు పైపాటుగా వేయాలి.

BAJRA CROP : రాష్ట్రంలో వరి, మొక్కజొన్న జొన్న తర్వాత నజ్జ ప్రధానమైన ఆహార పంట. సజ్జ పంటను మెట్ట ప్రాంతాల్లో, తక్కువ సారవంతమైన ఎర్రనేలలు, ఎర్రగరప నేలల్లో సాగు చేయడం మరియు స్ధానిక రకాలను వాడటం వలన తక్కువ దిగుబడులు వస్తున్నాయి. సజ్జ ఉత్పత్తి మరియు నాణ్యతను పెంచుటకు మంచి రకాలు. ఎంపిక మరియు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ఎంతో అవసరం. అంతేకాక వర్షాభావ పరిస్థితులలో, సకాలంలో ప్రధానమైన పంటను వేసుకోలేని పరిస్థితులలో తక్కువ కాలంలో. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడినిచ్చే సజ్జని ప్రత్యామ్నాయ పంటగా వేసుకొనవచ్చును.

విత్తు కాలం : వేసవిలో సజ్జను జనవరి మాసంలో విత్తుకోవచ్చును. తేలికపాటి ఎర్రనేలలు బాగా అనుకూలం. నీరు నిలువని నల్లరేగడి నేలల్లో కూడా సాగుచేసుకోవచ్చు కానీ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు నిలువవుంటే మొక్కలు సరిగా, ఎదగవు.

విత్తనం మరియు విత్తు పద్ధతి : ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి ౩ గ్రా. చొప్పున థైరమ్‌ను కలిపి విత్తనాన్ని శుద్ధి చేయాలి. నేరుగా విత్తనాన్ని సాళ్ళ మధ్య 45 సెం.మీ. దూరం మరియు సాళ్ళలో మొక్కల మధ్య 10 నుండి 15 “సెం.మీ. దూరం ఉండునట్లు విత్తుకోవాలి.

పొలం తయారీ : భూమిని 2-3 సార్లు బాగా దున్ని ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి.

ఎరువుల వాడకం : పంటకు ఎకరానికి 35 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం మరియు 15 కిలోల పొటాష్‌ను ఇచ్చు ఎరువులను వేయాలి. నత్రజనిని మాత్రం రెండు దఫాలుగా, సగభాగం విత్తేటప్పుడు. మిగిలిన సగభాగం విత్తిన 25-30. రోజుల వయస్సు మొక్కలకు పైపాటుగా వేయాలి.

అంతరకృషి మరియు కలుపు నివారణ : విత్తిన 21 రోజుల లోపు మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం ఉండేలా చూస్తూ ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. విత్తిన రెండు రోజులలోగా అట్రజిన్‌ 50% పాడి మందును ఎకరాకు 600 గ్రా. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడినేలపై పిచికారి చేసినచో కలువు మొక్కలను నివారించవచ్చును. విత్తిన తర్వాత 15 రోజులకు దంతులు నడిపి ఎదసేద్యం చేయాలి లేదా కలపు మొక్కలను తీసివేయాలి. కలుపు మొక్కలు బాగా ఉన్నట్లయితే విత్తిన 45 రోజులకు మరొకసారి కలుపు తీయించాలి.

నీరు కట్టుట : పంటకు పిలకలు, పూత మరియు గింజ పట్టే దశలలో నీరు పెట్టాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

సస్యరక్షణ చర్యలు ;

అగ్గితెగులు : ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఎక్కువగా ఆశించినప్పుడు లీటరు నీటికి 2.5 గ్రా. మ్యాంకోజెబ్‌ లేదా 1 గ్రా. కార్చండాజిమ్‌ చొప్పున కలిపి పైరుపై పిచికారి చేయాలి.

పంట కోత : సజ్జ పంట కోతకు వచ్చిన వెంటనే కంకులను కోసి ఎండనిచ్చి, నూర్చి మరియు తూర్పారబట్టి గింజలను, నిల్వచేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు