Sapota Forming
Sapota Forming : పండ్లతోటల పెంపకానికి ఆదరణ పెరుగుతోంది. ఒక్కసారి నాటితే దీర్ఘకాలంగా పంట దిగుబడులు రావడం.. ఇటు కూలీల అవసరం తగ్గటం.. నమ్మకమైన మార్కెట్ అవకాశాలు పండ్లతోటల సాగు విస్తీర్ణం పెరిగేందుకు దొహదపడుతున్నాయి.
READ ALSO : Green Malta farming : బత్తాయి సాగులో యాజమాన్య పద్ధతులు !
మారుతున్న పరిస్థితులు.. పెరుగుతున్న కూలీఖర్చులు.. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య వ్యవసాయం భారంగా మారింది. ఈ సమస్యల నుండి బయట పడేందుకు అనుబంధరంగమైన పండ్ల తోటలు అక్కరకు వస్తున్నాయి. దీన్ని గమనించిన సిద్దిపేట జిల్లాకు చెందిన నర్సింహులు అనే రైతు 6 ఎకరాల్లో సపోట మొక్కలు నాటి.. ప్రతి ఏటా నమ్మకమైన ఆదాయాన్ని పొందుతున్నారు.
మామిడి, అరటి, సపోట, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి పంటల్లో సాగు సమస్యలు తక్కువగా ఉన్న పంట సపోట. దీనికి చీడపీడల బెడద తక్కువే. అంతే కాదు .. ప్రతికూల పరిస్థితులను, నీటి ఎద్దడిని తట్టుకొని తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడినిస్తుంది.
READ ALSO : Plant Nursery Development : నర్సరీ నిర్వహణతో స్వయం ఉపాధి.. ఏటా రూ. 6 లక్షలు నికర ఆదాయం
నాటిన 4వ ఏట నుండి దిగుబడి ప్రారంభమై ఏటా నమ్మకమైన దిగుబడి వస్తుంది. 15 ఏళ్ల క్రితం 6 ఎకరాల్లో సపోట మొక్కలు నాటి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు రైతు నర్సింహులు.