Cauliflower, Cabbage Cultivation
Cabbage Cultivation : శీతాకాలంలో అధిక విస్తీర్ణంలోసాగయ్యే కూరగాయపంటల్లో క్యాబేజి, కాలీఫ్లవర్ ముఖ్యమైనవి . ఒకప్పుడు చలికాలంలోనే అధిక విస్తీర్ణంలో సాగుచేసే ఈ కూరగాయలు.. సూపర్ మార్కెట్ల రాకతో డిమాండ్ పెరగటం వల్ల రైతులు ఏడాది పొడవునా సాగు చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా ఏడాది పొడవునా దిగుబడులు తీసే విధంగా దఫదఫాలుగా విత్తి సాగుచేస్తున్నారు.
మరి క్యాబేజి, కాలీప్లవర్ సాగులో అధిక దిగుబడులు పొందాలంటే, మంచి రకాల ఎంపికతోపాటు, యాజమాన్యం చాలా కీలకం . సాగు వివరాలను పశ్చిమగోదావరి జిల్లా, వెంటకరామన్నగూడెం ఉద్యాన కళాశాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కె. ఉషా కుమారి ద్వారా తెలుసుకుందాం.
సాధారణంగా శీతాకాలం అక్టోబరు నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. కానీ ఈసారి అధిక వర్షాల వల్ల, కాలం ఆలస్యమయ్యింది. చల్లని వాతావరణం క్యాబేజి, క్యాలీఫ్లవర్ సాగుకు అనుకూలం. ఈ కాలంలో వచ్చే అధిక దిగుబడి వస్తుంది. ఉత్పత్తిలో నాణ్యత అధికంగా వుంటుంది. ఈ పంటలు సాగు చేయాలనుకునే రైతులు ఆయా ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులు, డిమాండ్ ను బట్టి, రకాలను ఎంచుకోవాలి.
సాధారణంగా మధ్యకాలిక రకాలను సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలు అక్టోబర్ నుండి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. అయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే విత్తనం మొదలు, భూమి దుక్కి , నారుమడి పెంపకం, మొక్కలు నాటడం వరకు కీలక దశలుగా చెబుతారు. ఈ సమయంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, వెంటకరామన్నగూడెం ఉద్యాన కళాశాల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కె. ఉషా కుమారి .
క్యాబేజి, కాలీఫ్లవర్ సాగులో ఎరువుల యాజమాన్యం కీలకం. ముందుగా ప్రధానపొలాన్ని దమ్ముచేసేటప్పుడే పశువుల ఎరువుతో పాటు జీవన ఎరువులను కలిపి దుక్కిలో చల్లుకోవాలి. వీటి తరువాత నత్రజని, భాస్వరం,పొటాష్ ఎరువులను వేసి కలియదున్నాలి. ముఖ్యంగా క్యాబేజి, కాలీప్లవర్ సాగుచేసే రైతులు ఆయా ప్రాంతాలలో నేలల రకాలను బట్టి విత్తన రకాలను ఎన్నుకోవాలి.
తేలిక పాటి నేలల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవాలి. బరువు నేలల్లో మద్యకాలిక, దీర్ఘకాలిక రకాలను సాగుచేసుకోవచ్చు. పువ్వు సైజు పెద్దగా వుండి, ఎకరాకు 12 నుండి 15 వేల కాలీఫ్లవర పూలు, క్యాబెజి గడ్డల దిగుబడి సాధిస్తే రైతులు ఆర్థికంగా మంచి ఫలితాలు సాధించే వీలుంది. శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సాగుచేస్తే నాణ్యమైన అధిక దిగుబడులను తీసేందుకు ఆస్కారం ఉంటుంది.
Read Also : Honey Bee Farming : తేనెటీగల పెంపకాన్ని ఉపాధిగా మల్చుకున్న మహిళ