Fertigation System : ఎరువుల వృధాను అరికట్టటంతోపాటు, మొక్కలకు నేరుగా పోషకాలు అందించే ఫర్టిగేషన్ విధానంలో సాగు!

ఫర్టిగేషన్ పద్దతిలో తక్కువ మోతాదులో ఎరువుల వినియోగం ఉండటంతోపాటు నేరుగా మొక్కకు అందించేందుకు అవకాశం ఉంటుంది.

Cultivation in the fertigation system that provides nutrients directly to the plants, besides preventing wastage of fertilizers!

Fertigation System : ఫర్టిగేషన్ విధానంలో మొక్కలకు అవసరమైన సాగునీరు,సూక్ష్మ, స్థూల పోషక ఎరువులు అన్ని మొక్కలకు సమానంగా ఒకేసారి అందించటం వీలవుతుంది. ఈ విధానంలో మొక్కలు ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకొని అధిక నాణ్యమైన దిగుబడులు సాధించడమే కాకుండా పర్యావరణంపై ప్రభావం పడకుండా చూసుకోవచ్చు.

కూలీల కొరత అధికంగా ఉన్న రోజుల్లో తక్కువ శ్రమతో మొక్కలకు నీటిని, నీటిలో కరిగే ఎరువులను అందించే వెసులుబాటు ఉండడంతో చాలామంది రైతులు బిందు సేద్యం లో ఫర్టిగేషన్ విధానాన్ని అనుసరించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫర్టిగేషన్ పద్ధతి వల్ల పంట దిగుబడులు దాదాపు 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

ఫర్టిగేషన్ విధానంలో మొక్కలకు అవసరమైన పోషకాలు ఖచ్చితత్వంతో మొక్క వేరు వ్యవస్థకు నేరుగా అందించడం వల్ల ఎరువుల వృధాను అరికట్టే నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. అలాగే కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు.

ఎరువులను వెదజల్లడం , మొక్కల మొదళ్ళలో వేయడం వంటి సాంప్రదాయ పద్ధతిలో ఎరువుల వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధానం కొంత శ్రమతో కూడుకున్నదిగా చెప్పవచ్చు. ఫర్టిగేషన్ పద్దతిలో తక్కువ మోతాదులో ఎరువుల వినియోగం ఉండటంతోపాటు నేరుగా మొక్కకు అందించేందుకు అవకాశం ఉంటుంది.

ఎగుడుదిగుడు పొలాల్లో నీరు ఇంకని ఇతర సమస్యాత్మక భూములకు ఫర్టిగేషన్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎరువుల వినియోగ సామర్ధ్యం గరిష్టస్ధాయికి ఈ విధానం ద్వారా పెంచవచ్చు.

ఎరువులు భూమిలో ఇంకిపోవటం, ఆవిరై పోవటం వంటి నష్టాలను అరికట్టవచ్చు. నీరు, పోషకపదార్ధాలు అందుబాటులో ఉండటం వల్ల మొక్కల పెరుగుదల బాగా ఉంటుంది. నాణ్యత అధికంగా ఉంటుంది.