Capsicum Cultivation : పోలిహౌస్ లలో కాప్సికమ్ సాగుకు నారు పెంపకం, మొక్కలు నాటే విధానం!

పోలిహౌస్‌లో ఎక్కువకాలము. పంట సాగు, అధిక దిగుబడులకు జూన్‌ మొదటి వారంలో నారు పోసుకోవాలి. పోలిట్రేలలో కోకోపిట్‌ నింపి, విత్తనాన్ని నాటి, వాటిపై వరిగడ్డి కప్పి నీరు పోసిన వారం రోజులలో మొలకెత్తి 20 రోజులలో మొక్కలు నాటుటకు వీలు కల్గుతుంది.

Cultivation of saplings and planting method for capsicum cultivation in polyhouses!

Capsicum Cultivation : ప్రస్తుతము కూరగాయల పంటలసాగు బయటప్రదేశంలో కాకుండా వెంటిలేటెడ్‌ పోలిహౌస్‌లలో సంవత్సరం పొడవునా వ్యాపార సరళిలో రైతులు పండించి మంచి ఆదాయము పొందుతున్నారు. అలాంటి పాలిహౌస్ కూరగాయల్లో కాప్సికమ్ కూడా ఒకటి. కాప్సికమ్‌లో ఆకుపచ్చరకం కాకుండా,పసుపు, ఎరుపు, పర్పుల్‌ రకాలను వ్యాపార సరళిలో పండించి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మన రాష్ట్రంలో పోలి హౌస్‌లలో పూలు పండించే రైతులు ప్రస్తుతము ఈ కూరగాయలను ఎక్కువగా తెలంగాణ, రాయలసీమ జిల్లాలలో పండిస్తున్నారు.

కాప్సికమ్ సాగులో పాలిహౌస్ ఎంపిక ;

వెంటిలేటెడ్‌ హౌస్‌లో ఈ పంటను పండించిన సంవత్సరములో 10 నెలలు దిగుబడి పొందుటకు అవకాశము కలదు. షేడ్‌నెట్‌ లలో సంవత్సరములో 6 నెలలు పంటను పొందవచ్చు. పోలివౌన్‌ను గాలి తక్కువగా వీచే ప్రాంతాలలో నిర్మించుకొన్న ఎక్కువకాలము మన్నుతుంది. తీరప్రాంతాలు, బయలు భూములలో కొత్త పాలిపౌస్‌లు వేయకుండా ఉండటమే మంచిది.

మట్టి ఎంపిక ; కాప్సికమ్ పెంచుటకు ఎర్రగరపనేలలు, మురుగు నీరు ఎక్కువగా ఇంకేప్రాంతాలు అనువైనవి. ఎన్నుకొన్న మట్టిని భూసార పరీక్ష చేయించి, ఉదజని సూచి 6-65, విద్యుత్‌ చాల్‌కల్‌ 0.75 డెసిమోస్‌ ఉన్న మట్టిని మాత్రమే వినియోగించాలి. ఎంచుకున్న మట్టిలో (560 చ.అ. పాలిహౌస్‌) బాగా మాగిన 6-8 ట్రాక్టర్ల పశువుల ఎరువు, 2 టన్నుల వరి ఊకను కలిపి బాగా దున్ని బెడ్స్‌ తయారు చేసుకోవాలి.

బెడ్స్ తయారి: ఎరువు కలిపిన తరువాత మట్టిని నాల్గు వైపులా బాగా దున్నించి చదునుచేయించాలి. ఆఖరి దుక్కిలో 200 కి.గ్రా. సూపర్‌ ఫాస్పేటు ఎరువు కలిపించాలి. బెడ్స్‌ ఉత్తర దక్షిణం వైపు 80 సెం.మీ. వెడల్పు, 25 సెం.మీ. ఎత్తు, బెడ్స్‌ మధ్యలో నడవడానికి వీలుగా 40 సెం.మీ. వెడల్పు దార్లు ఏర్పరచాలి. బెడ్స్‌ అన్నివైపులా లెవెల్‌చేసి బెడ్‌పైన ప్రతి 10 చదరపు మీటర్లకు 50 కెజి వేప చెక్క 200 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ మందు వేయించి కలిపించాలి.

ఒకవేళ పోలిహౌస్‌లో మట్టి, కాప్సికమ్‌ పెంచుటకు వీలు కాకున్నా 5 కెజి మట్టి మిశ్రమము. పట్టే పాలిథీన్‌ సంచులు, లేకుంటే. సిమెంట్‌ సంచులను కూడా ఎన్నుకొని వాటిలో మట్టి ఎరువు మిశ్రమాన్ని నింపిన తర్వాత సంచులను 45 సెం.మీ. దూరంలో లైనులో పెట్టి వాటిలో కూడా. మొక్కలు నాటుకోవచ్చు. బెడ్స్‌ తయారి అయిన తరువాత బెడ్స్‌ను ఫార్మల్‌ డీహైడ్‌ 30 లీటర్లు – 1000 లీటర్ల నీటిలో కలిపి ఫుమిగేట్‌ చేయించిన అన్ని రకాల శిలీంద్రాలు, క్రిమి, కీటకాదులను అరికట్టవచ్చు. పోలిబేగ్‌లలో నింపే మట్టిని కూడా ముందుగా ఫుమిసేట్‌ చేసి తరువాత పోలిబేగ్‌లలో నింపుకోవాలి.

కాప్సికమ్‌ రకాలు, ఎంపిక ; మన రాష్ట్రంలో ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, పర్పుల్‌ రకాలను ఎక్కువగా సాగు చేన్తున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి నిమిత్తం ఎక్కువగా ఎరువు, వనువు రకాలు ఎక్కువగా పండిస్తున్నారు. ఈ రకాలు విత్తనాలను వివిధ మల్టీ నేషనల్‌ కంపెనీలు పంపిణీ చేస్తున్నాయి. మన రాష్ట్రంలో పండించుటకు అనువైన రకాలు, ఇంద్ర, నింధూకి, రతన్‌, అరుణ్‌, డాంచీ ముఖ్యమైనవి. 560 చ.మీ. పాలీహౌస్‌లో రెండు రంగుల కావ్సికమ్‌ రకాలను నాటుకోవచ్చు. 560 చ.మీ. పాలివౌస్‌లో నాటుటకు 40 గ్రా. విత్తనాలు కావాలి.

నారుపెంచుట, నాటు కాలము: పోలిహౌస్‌లో ఎక్కువకాలము. పంట సాగు, అధిక దిగుబడులకు జూన్‌ మొదటి వారంలో నారు పోసుకోవాలి. పోలిట్రేలలో కోకోపిట్‌ నింపి, విత్తనాన్ని నాటి, వాటిపై వరిగడ్డి కప్పి నీరు పోసిన వారం రోజులలో మొలకెత్తి 20 రోజులలో మొక్కలు నాటుటకు వీలు కల్గుతుంది. మొక్కలు 10 సెం.మీ. ఎత్తులో ఉన్నప్పుడు నాటుకున్న ఎక్కువ దిగుబడులు పొందుటకు అవకాశము ఉంది. ముదిరిన నారు. నాటుకుంటే అనుకొన్న ఫలితాలు రావు.

నారు మొక్కలను జూన్‌ చివరివారం లేక జూలై మొదటిలో నాటుకోవాలి. మొక్కలు నాటిన తరువాత మొక్కకు 25. మి.లీ. కార్చన్‌డిజిమ్‌ మందు ద్రావణాన్ని మొక్కకు మొదలులో పోయించాలి. (2 గ్రా.ఒక లీటరు నీరు) మొక్కలు నాటే ముందుగాని, నాటిన వారం రోజులలోపు డ్రిప్‌ పైపులు ఏర్పరిచి, డ్రిప్స్‌ ద్వారా నీరు ఇవ్వాలి. పాలిబేగ్స్‌లో మొక్కలు నాటిన తరువాత నీరు బేగ్‌లలో పడే విధముగా డ్రిప్‌ పైప్‌ ఏర్పాటు చేయాలి.

వాతావరణంలో తేమ 50-60 శాతం కన్నా తగ్గకుండా ఉంచుటకు, నాల్గు వైపులా నీటిని విరజిమ్మే ఫాగర్స్‌ను పాలిహౌస్‌ పై భాగంలో ఏర్పాటు చేసి, తేమ. పెంచడము ద్వారా మొక్కల ఉష్ణోగ్రత బాగా తగ్గించుటకు వీలు కల్గుతుంది. మొక్కలు నాటిన 10-15 రోజులలో ఏపుగా పెరగని మొక్కలను గుర్తించి తీసివేసి వాటి స్థానంలో బాగా పెరిగే మొక్కలను. నాటుకొంటే దిగుబడి బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది.