Dates Farming : సిరులు కురిపిస్తున్న ఖర్జూరం సాగు..

Dates Farming : సాధారణంగా ఖర్జూరం అనగానే మానకు మార్కెట్ లో నల్లగా ఉండి మెత్తగా ఉంటుంది. ఈ తోటలో చెట్లకు కాసిన పండ్లు ఎల్లో కలర్ లో ఉంటాయి. ఇది బర్హీ రకం . ఇది కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

Karjura Cultivation

Dates Farming : ఒకప్పుడు వానలు లేక కరవుతో అల్లాడిన అనంతపురం జిల్లా ఇప్పుడు సిరులనిచ్చే పంటలకు నెలవుగా మారింది.  తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ఖర్జూరం పంట జోరుగా సాగవుతుంది. నాలుగేళ్ల క్రింతం ఖర్జూర మొక్కలను ప్రయోగాత్మకంగా నాటిన రైతు ప్రస్తుతం దిగుబడులను పొందుతున్నాడు. ఇంతకీ ఖర్జూరం సాగు ఎలా ఉంది..?  పెట్టుబడి ఎంత అవుతుంది..? మార్కెటింగ్ సమస్యలేమైనా ఉన్నాయా..?  రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం..

Read Also : Agriculture Farming : సమీకృత వ్యవసాయం చేస్తున్న యువకుడు

అందరిలాగే మూసదోరణిలో పంటలు సాగుచేస్తే… నష్టాలు తప్పా.. లాభాలు ఉండవు. అందుకే మార్కెట్ లో డిమాండ్ ఉండే పంటలను ఎంచుకొని,  సాగులో వస్తున్న నూతన సాంకేతక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగుచేస్తే.. లాభాలు తప్పకుండా వస్తాయి. ఇందుకు నిదర్శనమే  అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం, మర్తాడు గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి . ఇప్పటికే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి విజయం సాధించిన ఈ రైతు.. ఇప్పుడు ఖర్జూరను సాగుచేసి సక్సెస్ అయ్యారు.

సాధారంణంగా ఖర్జూరం అనగానే మానకు మార్కెట్ లో నల్లగా ఉండి మెత్తగా ఉంటుంది. కానీ ఈ తోటలో చెట్లకు కాసిన పండ్లు ఎల్లో కలర్ లో ఉంటాయి. ఇది బర్హీ రకం . ఇది కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండు అయ్యాకా పసుపు రంగులోకి మారుతుంది. సాధారణంగా ఖర్జూరాన్ని బెల్లంలో ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తుంటారు.

కానీ ఇది ఫ్రెష్ ఫ్రూట్. నేరుగా చెట్టునుండి కోసుకొని తినేయవచ్చు. ఈ రకాన్ని రైతు రమణారెడ్డి నాలుగు సంవత్సరాల క్రితం ఆబుదాబి నుండి 250 మొక్కలను తెప్పించి నాటారు. అందులో 200 మొక్కలు ఆడవి, 50 మొగ మొక్కలు ఉన్నాయి. ఒక్కో మొక్కకు 4 వేల 250 రూపాయలు అయ్యింది. నాటిన 3 ఏడాది కొద్ది మొత్తంలో దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 4వ సంవత్సరం దిగుబడులను తీస్తున్నారు.

ఖర్జూరం మొక్కలు ప్రతి ఏటా జనవరి, పిబ్రవరిలో పూతకు వస్తాయి. వచ్చినప్పుడు మొగ పుష్పాలనుండి వచ్చిన పుప్పడితో ఆడమొక్కలకు వచ్చిన పుష్పాలను క్రాసింగ్ (పాలినేషన్ ) చేయాలి. ఇలా పూత వచ్చిన 150 రోజులకు పండ్లు కోతకు వస్తాయి. ఇప్పటికే 3 ఎకరాలపై 5 టన్నుల దిగుబడిని తీసుకున్న రైతు.. మరో 5 టన్నుల దిగుబడి మొక్కలపైనే ఉందంటున్నారు. ఇలా ప్రతిఏటా దిగుబడి పెరగనుంది. ఇలా 60 , 70 ఏళ్లపాటు దిగుబడి ఇవ్వనున్నాయి మొక్కలు.

పంట ఆరంభంలో పెట్టుబడి ఎక్కువే అయినా… పూర్తి పంట కాలంతో పోల్చుకుంటే ఆ పెట్టుబడి లెక్కలోకి కూడా రాదు. ఒక్కసారి నాటితే దాదాపు 70 సంవత్సరాల పాటు పంటను తీసుకోవచ్చు. ఇతర పంటలతో పోల్చితే తక్కువ శ్రమతో… అధిక లాభాలు పొందవచ్చని రైతు అనుభవం నిరూపిస్తోంది. తోటి రైతులు కూడా మార్కెట్ లో డిమాండ్ ఉన్నఆధునిక పంటలను సాగుచేస్తే మంచి లాభాలు గడించవచ్చు.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు