Vermi Wash
Vermi Wash : పనికిరాని సేంద్రీయ వ్యర్థ పదార్ధాలను పేడతో కలిపి వానపాములతో వర్మీకంపోస్టు తయారుచేసే విధానం అనాదిగా అమలులో వుంది. అయితే వర్మీకంపోస్టు నుండి వర్మీ వాష్ ను కూడా తయారుచేసుకోవచ్చు. ద్రవ రూపంలో లభించే ఈ లిక్విడ్ లో వర్మీ కంపోస్టులో కంటే విలువైన పోషకాలు వున్నాయి. పంటలపై పిచికారీ చేయటం ద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే ఇది రైతు స్థాయిలో ఏవిధంగా తయారు చేసుకోవచ్చో చేసి చూపిస్తున్నారు జిగిత్యాల జిల్లాకు చెందిన రైతు అశోక్ .
READ ALSO : ప్రభుత్వ భరోసాతో అధికంగా పంటలు వేస్తున్న రైతులు
పంటలసాగులో అధిక పోషక విలువలు వున్న వర్మీకంపోస్టు వాడకం అధిక దిగుబడికి దోహదపడుతుంది. వర్మీ కంపోష్టును షెడ్లలో బెడ్ల ద్వారా వుత్పత్తి చేస్తున్నారు. దీనికి ప్రధాన ముడిసరకు వ్యవసాయ వ్ర్యర్థాలు, పేడ. వానపాములను బెడ్లపై వదలటం ద్వారా 45 నుండి 50 రోజుల్లో ఈ కంపోస్టు ఉత్పత్తి అవుతుంది. ఇది పొడి రూపంలో వుంటుంది. అయితే ద్రవరూపంలో అధిక పోషక విలువలు వున్న వర్మీవాష్ ను కూడా రైతులు ఉత్పత్తి చేసుకోవచ్చు.
READ ALSO : చంద్రునితోపాటు అంగారక గ్రహంపై పంటలు పండించే చాన్స్
దీన్ని పంటలపై పిచికారిచేయటం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. వర్మీవాష్ ఉత్పత్తికి డ్రమ్మును ఉపయోగించాల్సి వుంటుంది. దీనిలోకుళ్లిన చెత్త, పశువుల ఎరువును వేసి, వానపాములను వదలుతారు. పైన చిన్న కుండను ఏర్పాటుచేసి నీటిని బొట్లుబొట్లుగా డ్రమ్ములో పడేటట్లు చేస్తారు. డ్రమ్ము కింది చిన్న పైపు అమరిక వుంటుంది. 15వ రోజునుండి వర్మీవాష్ ను సేకరించి పంటలకు వాడుకోవచ్చు. వర్మీవాష్ ఉత్పత్తి చాలా సులభం అని తెలియజేస్తున్నారు హైదరాబాద్ లో నివాసముంటున్న జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, ఒగులాపూర్‌గ్రామ రైతు అశోక్ కుమార్.
READ ALSO : Integrated Farming : ప్రణాళిక బద్ధంగా సమీకృత వ్యవసాయం.. కొబ్బరితో పాటు చేపలు , కోళ్లు పెంపకం
ప్రకృతి సేద్యంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు. రైతులంతా ఈ మార్గాన్ని అనుసరిస్తే సాగుభూమి నిర్వీర్యం కాకుండా వుంటుంది. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతాయి. మనతో పాటు భావితరాలు క్షేమంగా వుండాలంటే ప్రకృతి సేద్యమే ఏకైకమార్గం అంటున్నారు రైతు అశోక్ కుమార్