Ginger Garden : అల్లం పంటలో బ్యాక్టీరియా వడతెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Ginger Garden : వాణిజ్య పంట అయిన అల్లంను ఈ ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 70 నుండి 100 రోజుల దశలో ఉంది.

Ginger Garden

Ginger Garden : తెలుగు రాష్ట్రాల్లో అల్లం పంట దాదాపు 70 నుండి 100 రోజుల దశలో ఉంది . అడపాదడప కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాల్లో బ్యాక్టీరియా వడలు తెగులు, బ్యాక్టీరియా దుంపకుళ్లు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడి పొందేందుకు అవకాశం ఉంటుది. బ్యాక్టీరియా వడలు తెగులు, దుంపకుళ్లు నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్దతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జే. హేమంత్ కుమార్.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

వాణిజ్య పంట అయిన అల్లంను ఈ ఖరీఫ్ లో తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేశారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 70 నుండి 100 రోజుల దశలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జల్లాలలో దాదాపు 1,771 హెక్టార్లలో సాగవుతుంది.

అయితే, ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో కూడా కొంత విస్తీర్ణంలో సాగుచేశారు రైతులు. అయితే అడప దడపా కురుస్తున్న వర్షాలకారణంగా అల్లం పంటలో నీరు నిలిచిపోవడంతో బ్యాక్టీరియా వడలు తెగులు,  దుంపకుళ్లు సోకింది. బరువైన నేలల్లో సాగుచేసిన ప్రాంతాల్లో వీటి ఉదృతి అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త  డా. జే. హేమంత్ కుమార్.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు