Biological Chemicals : పంటపొలాల్లో జీవ రసాయనాల వాడకం విషయంలో, భద్రపరుచుకునే క్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలు!

జీవ రషాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో గాని, తేమ , నీరు ఉన్న ప్రదేశాలలో గాని ఉంచరాదు. వీలయినంత వరకు శాస్త్రీయంగా నిర్ధారించబడిన సిఫార్సు చేసిన మోతాదులు , వాడకం పద్దతులను ఎలాంటి మార్పులు చేయకుండా అనుసరించటం మంచిది.

Biological Chemicals : పంటలో సాగులో రైతులు విచక్షణా రహితంగా రసానిక ఎరువుల, పురుగు మందుల వాడకం వల్ల నేలసారం తగ్గిపోతుంది. దీంతో పాటు ఉత్పత్తులలో పురుగు మందుల అవశేషాలు ఉండిపోవటం వల్ల ధర సరిగా లభించటం లేదు. ఈ నేపధ్యంలో ఇటీవలి కాలంలో జీవన ఎరువులు, జీవ రసాయనాల వాడకం క్రమంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జీవ రసాయనాలను భద్రపరుచుకునే విషయంలో, వాడకంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ;

1. జీవ రషాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో గాని, తేమ , నీరు ఉన్న ప్రదేశాలలో గాని ఉంచరాదు.

2. జీవ రసాయనాల ప్యాకింగ్ ను వీలయినంత వరకు వాడుకునే సమయంలో మాత్రమే విప్పుకోవాలి.

3. ఎన్.పి.వి వైరస్ ద్రావణాన్ని వీలయినంత వరకు సాయంత్రపు వేళలలో పిచికారీ చేయాలి.

4. జీవ రసాయనాలను రసాయనిక పురుగు మందులు, తీగుళ్ళ మందులతో కలిపి వాడరాదు.

5.ట్రైకోడెర్మా లేక సుడోమోనాస్ తో విత్తనశుద్ది గింజ విత్తుకునే ముందు మాత్రమే చేపట్టాలి.

6. వీలయినంత వరకు శాస్త్రీయంగా నిర్ధారించబడిన సిఫార్సు చేసిన మోతాదులు , వాడకం పద్దతులను ఎలాంటి మార్పులు చేయకుండా అనుసరించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు