Paddy Cultivation : జైశ్రీరాం, హెచ్.ఎం.టికి ప్రత్యామ్నాయ వరి రకాలు.. అతి సన్నగింజ రకాలు

Paddy Cultivation : తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. 

Paddy Cultivation : వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవాలు ముంచుకోస్తాయో తెలియని పరిస్థితులు. మరోవైపు మార్కెట్ లో అతిసన్న గింజ వరి రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనినే దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు అతిసన్న రకాలను రూపొందించారు. ఇప్పటికే సాగులో ఉన్న ఈ రకాలు మంచి దిగుబడులను నమోదు చేస్తున్నాయి. ఇంతకీ .. ఆ రకాలేంటీ.. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

Read Also : Natural Farming : చౌడు భూముల పునరుద్ధరణ – జిప్సమ్, పచ్చిరొట్ట ఎరువులతో చౌడు నివారణ 

తెలంగాణలో చెరువులు, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది.  చాలా వరకు దొడ్డుగింజ, సన్నగింజ రకాలను సాగుచేస్తుంటారు రైతులు. అయితే ఇటీవల కాలంలో అతి సన్నగింజ రకాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వినియోగదారులు అధికంగా వీటిని ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఉన్న జైశ్రీరాం, హెచ్.ఎం.టీ లాంటి రకాలను రైతులు సాగుచేస్తున్నా.. సరైన దిగుబడిని తీయలేకపోతున్నారు.

ముఖ్యంగా ఈ రకాలు చీడపీడలను తట్టుకోలేకపోవడంతో పెట్టుబడులు అధిక మవుతున్నాయి . వీటిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలంయం శాస్త్రవేత్తలు నాలుగు అతిసన్న గింజ రకాలను రూపొందించారు. రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేస్తున్నాయి. మరి ఆ రకాలు వాటి గుణగణాల గురించి రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర్ రాజు ద్వారా తెలుసుకుందాం.

Read Also : Natural Farming : సాగుకు యోగ్యంగా చౌడుభూముల పునరుద్ధరణ

ట్రెండింగ్ వార్తలు