Onion Cultivation : ఉల్లిసాగులో రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

కలుపు తీసిన ప్రతి సారి మొక్కచుట్టూ మట్టిని ఎగదోసి,పెరిగే గడ్డలకు ఎండ తగలకుండా చూడాలి. ఎండ తగిలితే గడ్డలు ఆకుపచ్చగా మారి తినడానికి వీలుకావు. నాటిన 75 రోజులకు మాలిక్‌ హైడ్రాజైడ్‌ (2.5 గ్రా/లీ.) పిచికారి చేస్తే నిల్వలో గడ్డలు మొలకెత్తడం తగ్గుతుంది.

Onion Production

Onion Cultivation : ముఖ్యమైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన ఉల్లిగడ్డను పచ్చికూరగానూ, తినే పదార్థాలకు రుచి కల్పించడానికి గాను వాడతారు. మన రాష్ట్రంలో విసృతంగా అధిక విస్తీర్ణంలో సాగుచేయబడుతూ రైతులకు అధిక రాబడికి దోహదపడుతుంది.

READ ALSO : Mulberry Cultivation : రెండెకరాల్లో పట్టుపురుగుల పెంపకం.. నెలకు లక్షరూపాయల నికర ఆదాయం

సాగుకు అనువైన రకాలు ;

ఎర్ర ఉల్లి: బళ్ళారి రెడ్‌, నాసిక్‌ రెడ్‌, పూసా రెడ్‌, అగ్రి ఫౌండ్‌ లైట్‌ రెడ్‌, అర్మకళ్యాణ్‌, అర్మ ప్రగతి, అర్క బిందు

లేత ఎరుపు: అగ్రి ఫౌండ్‌ రెడ్‌ లైట్‌ రెడ్‌, అర్క నికేతన్‌.

పసుపు: ఎర్లీ గ్రానో, అర్మ పీతాంబర్‌.

తెల్ల ఉల్లి: పూసా వైట్‌ ఫ్లాట్స్‌, అగ్రి ఫౌండ్‌ వైట్‌

సాంబారు ఉల్లి: బెంగుళూర్‌ రోజ్‌, అగ్రి ఫాండ్‌ రోజ్‌, కో-1, 4

ఎరుపు హైబ్రిడ్స్‌ : అర్కలాలిమ, అర్క కీర్తిమాన్‌.

READ ALSO : Home insurance: బీమాతో భరోసా.. ఇంటికి ఇన్సూరెన్స్ ఎలా చేయించాలి..?

తెల్ల ఉల్లిలోకన్నా ఎర్ర ఉల్లిలో ఘాటు ఎక్కువ. ఎకరాకు 3-4 కిలోల విత్తనం వాడి ఖరీఫ్‌లో జూన్‌, జూలైలో నారు పోసి ఆగష్టు మొదటి పక్షంలో నాటాలి. రబీలో అక్టోబరు రెండో పక్షంలో నారు పోసి డిసెంబరు మొదటి వారంలో, వేసవి పంటగా జనవరిలో నాటాలి. 15%10 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. ఆఖరు దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 250 కిలోల వేపపిండి, జీవన ఎరువులైన అజటోబాక్టర్‌ 2 కిలోలు, ఫాస్ఫో బాక్టీరియా 2 కిలోలు వేసి నాటే ముందు 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్‌ 20-32 కిలోల భాస్వరం వేయాలి. నాటిన 30, 45 రోజులకు 20 కిలోల నత్రజని, 10 కిలోల పొటాష్‌ చొప్పున వేయాలి. మొక్కలు పెరిగే దశలో 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవధిలో, గడ్డ ఊరే దశలో 5-6 రోజులకోతడివ్వాలి. కోతకు 15 రోజుల ముందు నీరివ్వడం ఆపాలి.

ఉల్లిలో సస్యరక్షణ ;

తామర పురుగులు : ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. దానితోబాటుగా ఆకులపై, కాడలపై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటి నివారణకు ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి10 రోజుల వ్యవధితో రెండు మూడుసార్లు పిచికారి చేయాలి.

READ ALSO : Cabbage and Cauliflower Cultivation : క్యాబేజి, కాలీప్లవర్ సాగులో అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

ఆకు తినే వచ్చవురుగు : నివారణకు కార్బరిల్‌ 8 గ్రా. లేదా ఎండోసల్ఫాన్‌ 2 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకు మచ్చతెగులు : ఆకులపై ఊదారంగు మచ్చలు ఏర్పడి ఆకులు, ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువైనపుడు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు 3 గ్రా. మాంకోజెబ్‌ లేదా క్లోరోథాలోనిల్‌ 25 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కలుపునివారణ: నారు నాటిన రెండో రోజు పెండిమిథాలిన్‌ (స్టాంపు) 1.2 లీ./200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారి చేయాలి.

అంతర కృషి : కలుపు తీసిన ప్రతి సారి మొక్కచుట్టూ మట్టిని ఎగదోసి,పెరిగే గడ్డలకు ఎండ తగలకుండా చూడాలి. ఎండ తగిలితే గడ్డలు ఆకుపచ్చగా మారి తినడానికి వీలుకావు. నాటిన 75 రోజులకు మాలిక్‌ హైడ్రాజైడ్‌ (2.5 గ్రా/లీ.) పిచికారి చేస్తే నిల్వలో గడ్డలు మొలకెత్తడం తగ్గుతుంది.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

నీటి యాజమాన్యం : నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవధితో 4-5 తడులు ఇవ్వాలి. గడ్డ వూరే దశలో 6-7 రోజుల వ్యవధిలో 7-8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజుల ముందుగా, నీరు కట్టుటం ఆపాలి.

పంటకోత , ఆరబెట్టడం : గడ్డలు పీకడానికి ముందు నీళ్ళు కట్టడం ఆపేయాలి. ఉల్లి ఆకులను, గడ్డకు 2.5 సెం.మీ. కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తరువాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి. 50 శాతం అకులు పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.

READ ALSO : Dragon Fruit Cultivation : డ్రాగన్ ఫ్రూట్ సాగుతో.. సత్ఫలితాలు సాధిస్తున్న యువరైతు

క్యూరింగ్‌ : క్యూరింగ్‌ వలన పొర రంగు అభివృద్ధి చెందుతుంది. 8-4 రోజులు పాలం మీదే ఎండబెట్టి, తర్వాత 10-12 రోజులు నీడలో ఎండబెట్టి ఆ తర్వాత నిల్వ చేస్తే నష్టం చాలావరకు తగ్గుతుంది. ఖరీఫ్‌ కాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండనందువలన సూర్యరళ్ళి ద్వారా క్యూరింగ్‌ చేయవచ్చు.

పరిపక్వం కాని చిన్న చిన్న పాయలను ఎపుడూ నిల్వ ఉంచరాదు. సుమారు 4-6 సెం.మీ. ఆకారం కలిగిన మధ్యస్థమైన పాయలు మంచి నిల్వ గుణం కలిగి ఉంటాయి. ఎకరాకు ఖరీఫ్‌లో 80-100 క్వింటాళ్ళు రబీలో 120-140 క్వింటాళ్ళు చొప్పున దిగుబడినిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు