Cultivation Of Fodder Crops : పశుగ్రాస పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తరువాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించాలి. లేకపోతే పశువులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లయిన సుబాబుల్, అవిశె మొదలైనవి పెంచటం వల్ల సమృద్ధిగా అందించవచ్చు.

Cultivation Of Fodder Crops :

Cultivation Of Fodder Crops : పశుపోషణ అంతా వాటికి అందించే మేతపైనే అధారపడి ఉంటుంది. తగినంత మేతను పశువులకు అందించినప్పుడే పాల దిగుబడి బాగా ఉంటుంది. పాడిని జీవనాధారంగా చేసుకున్న రైతులు పశువులకు అవసరమైన గ్రాసాన్ని సాగు చేసే విషయంలో కొన్ని పద్దతులతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

గడ్డిజాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చలా చిన్నగా ఉంటాయి. కాబట్టి వాటిని విత్తే సమయంలో లోతు 2 సెం.మీ కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి. నాణ్యత కలిగిన అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50 శాతం పూత దశలో కోయాలి.

పశువుల మేతలో మూడు వంతుల గడ్డిజాతి పశుగ్రాసంతోపాటు ఒక వంతు పప్పుజాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వల్ల అధిక పోషకవిలువలున్న పచ్చిమేత లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తరువాత చాఫ్ కట్టర్ ద్వారా చిన్నముక్కలుగా చేయాలి. దీని వల్ల పశువులు తీసుకునే ఆమార పరిమాణం పెరుగుతుంది. అంతేకాకుండా పశుగ్ర నష్టాన్ని నివారించవచ్చు.

జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తరువాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించాలి. లేకపోతే పశువులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లయిన సుబాబుల్, అవిశె మొదలైనవి పెంచటం వల్ల సమృద్ధిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాల్లో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ , దేవకాంచనం, దురిశెన, ఇప్పచెట్లు, రావిచెట్లు మర్రిచెట్టు, మునగ, సీమచింత, గంగిరేగు వంటి చెట్లను ఉపయోగించుకొని వేసవిలో పశుగ్రాస కొరతను అధిగమించవచ్చు.

లూసర్న్ లో బంగారు తీగ పరాన్న కలుపు నివారణకు కల్తీలేని నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో కలుపు మందులను పిచికారి చేసుకోవాలి. చీడపీడల నివారణకు పిచికారీ చేసే రసాయన మందులను కోతకు 20 రోజుల మందే పిచికారి చేయాలి.