Selection of suitable seed types in Poddu Thirugu cultivation!
Sunflower Variety Selection : నూనె పంటల సాగులో పొద్దు తిరుగుడు కూడా ఒకటి. ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుండటంతో ఇటీవలి కాలంలో పొద్దుతిరుగుడు గింజలతో తయారైన నూనెను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్లో పొద్దుతిరుగుడుకు మంచి డిమాండ్ పెరిగింది. లాభసాటిగా ఉండటంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడులు ఆశించి పొద్దు తిరుగుడు సాగు చేయాలనుకునే రైతులు ముందుగా విత్తనాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సాగుకు అనుకూలమైన విత్తనాలను ఎంపిక చేసుకోవటం ద్వారా ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చు. తద్వారా మంచి అదాయం లభించేందుకు అవకాశం ఉంటుంది.
నీరు నిల్వ ఉండని తటస్థ భూములైన ఎర్ర ,చల్కా ,ఇసుక ,రేగడి మరియు ఒండ్రనేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఉదజని సూచిక 6.5నుండి 8.0ఉన్న నేలలు ఈ పంటకు అనుకూలం. ఆమ్ల లక్షణాలు కలిగిన నేలల్లో కంటె కొద్దిగా క్షార లక్షణాలు గల నేలల్లో బాగా పండుతుంది. ఈ పంట అధిక తేమను తట్టుకోలేదు కావున లోతట్టు మరియు సముద్ర ధీర ప్రాంతాల్లో సాగు చేయరాదు. తేమ ఎక్కువ కాలం నిల్వఉంచుకోగల నల్ల రేగడి నేలల్లో రబీ,వేసవి మరియు వసంత కాలపు పంటలు వేసుకోవచ్చు.
వర్షాధారంగా పండిస్తే ఎకరాకు రకాలను 3 నుండి 4 కిలోలు ,సంకరాల కైతే 2-2.5కిలోల విత్తనం అవసరమౌతుంది. నీటి పారుదల క్రింద ఎకరాకు 2.5 నుండి 3.5కిలోల మరియు సంకరాలకు 2కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలను విత్తేముందు 12గంటలు నీటిలో నానబెట్టి తరువాత నీడలో ఆరబెట్టి విత్తనా శుధ్ధి చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 2 నుండి 3గ్రాముల థైరమ్ లేదా కాప్తాన్ కలిపి విత్తనా శుద్ధి చేయాలి. నేక్రోసిన్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5గ్రా ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి.
ప్రొద్దు తిరుగుడు సాగులో అనువైన రకాలు ;
1. యాన్.డి.యస్.హెచ్-1 ; పంటకాలం 80-85 రోజులు. పంట దిగుబడి ఎకరాకు 600కిలోలు మొక్కలు 120-130సెం.మీ ఎత్తు పెరుగుతాయి. నూనె శాతం 40-42 శాతం. మిగిలిన అన్ని సంకర రకాల కన్నా ముందుగా కోత కొస్తుంది. బూజు తెగులును తట్టుకొంటుంది.
2.యం.యస్.ఎఫ్.హెచ్-17 ; పంటకాలం 90-95 రోజులు. పంట దిగుబడి ఎకరాకు 600కిలోలు వస్తుంది. మొక్కలు 120-140సెం.మీ ఎత్తు పెరుగుతాయి. నూనె శాతం 36 శాతం
3. కె.బి.యస్.హెచ్-1 ; పంటకాలం 90-95 రోజులు. పంట దిగుబడి ఎకరాకు 640కి.లోలు వస్తుంది. మొక్కలు 130-150సెం.మీ ఎత్తు పెరుగుతాయి.నూనె శాతం 41 నుండి 43 శాతం
4. యం.యస్.ఎఫ్.హెచ్-8 ; పంటకాలం 90-95 రోజులు. పంట దిగుబడి ఎకరాకు 600కి.లోలు వస్తుంది. మొక్కలు 130-150సెం.మీ ఎత్తు పెరుగుతాయి. నూనె శాతం 41 నుండి 43 శాతం