Nursery
Plant Nursery Development : మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో కూడా మార్పులొస్తున్నాయి. పండ్లతోటల సాగులో రైతులంతా, ఇప్పుడు నర్సిరీలపైనే ఆదారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీలు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో, మొక్కలను అభివృద్ది పరిచి, రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు గత 22 ఏళ్లుగా నర్సరీని విజయవంతంగా నిర్వహిస్తూ.. రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు.
READ ALSO : Papaya Cultivation Techniques : బొప్పాయిలో చీడపీడల బెడద – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
ఏ తోట అభివృద్ది అయినా నాణ్యమైన జాతిమొక్కల పైనే ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మొదటి ఏడాదిలోనే ఏదైనా తప్పు జరిగితే, ఆ తరువాతి కాలంలో దానిని సరిదిద్దుకోవడం జరగదు. తోట యజమానులకు, తోట దిగుబడి, ఆదాయంలో ఎప్పటికీ తేరుకోలేనంత నష్టం జరుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోనే పండ్లతోటలను సాగుచేయాలనుకునే రైతులు నర్సరీలపై ఆదారపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే, నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా, రైతులకు కావల్సిన రకాలను అభివృద్ది చేసి అందిస్తున్నాయి. దీంతో ఐదారేండ్లకు రావాల్సిన దిగుబడులు రెండుమూడేండ్లకే వస్తున్నాయి. దీంతో ఇటు రైతులు అటు నర్సరీ యజమానులకు మంచి లాభాలు వస్తున్నాయి.
READ ALSO : Pindinalli : దానిమ్మ, మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు నష్టం కలిగిస్తున్న పిండినల్లి! నివారణ చర్యలు
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం, పెద్దాపురం గ్రామంలో మొగులయ్య నర్సరీ నిర్వహిస్తున్నారు. 20 సంవత్సరాలుగా రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు. మొదట్లో మామిడి మొక్కలను మాత్రమే తయారు చేసేవారు. అయితే మారుతున్న కాలానుగుణంగా పలుపండ్లు, పూల రకాలను అభివృద్ది చేస్తున్నారు. ఇందులో మామిడిలో అన్ని రకాలతో పాటు, జీడిమామిడి, అల్లనేరేడు, బహుడోలి, బత్తాయి, నాగ్ పూర్ కమలా, సీతాఫలంలో పలు రకాలు, సపోట, దానిమ్మ, నిమ్మలో పలు రకాలు, కొబ్బరితో పాటు పలు రకాల మొక్కలను అభివృద్ధి చేస్తున్నారు. తనతో పాటు మరో 10 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. అన్ని ఖర్చులు పోను, ఏడాదికి 5 నుండి 6 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు.
READ ALSO : Red Okra : పోషలతో నిండిన ఎర్ర బెండ ! దీని ప్రత్యేకతలు తెలిస్తే?
నర్సరీల మధ్య పోటీ పెరగడంతో, తక్కువ ధరలకే ఇటు రైతులకు మొక్కలు అందుతున్నాయి. దీంతో లాభాలు తగ్గాయని నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ఎర్రమన్ను సమస్య అధికమైందని, అలాగే వ్యవసాయానికి ఫ్రీగా ఇచ్చే కరెంట్ కు ఇప్పుడు మీటర్లు బిగిస్తామనడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే లాభాలే అంతంత మాత్రం.. ఇక మీటర్లు బిగిస్తే, నర్సరీలన్నీ తీసివేయాల్సి వస్తుందని వాపోతున్నారు.