Onion Cultivation : ఉల్లి సాగుకు అనువైన నేలలు, చేపట్టాల్సిన యాజమాన్యపద్ధతులు !

ఉల్లి పంట వెయ్యడానికి ముందునేలను దమ్ము చేసుకోవాలి. ఆఖరిగా దుక్కి అయిపోయాక భూమిని చిన్న, చిన్న మడులుగా విభజించాలి. నీరు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేయాలి.

Onion Cultivation

Onion Cultivation : మూడు సీజన్లలో ఉల్లిని సాగు చేయవచ్చు. ముఖ్యమైన రబీ అక్టోబరు నెల నుండి నవంబరు నెలలో నాటుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు. జూన్‌ నెల నుండి జూలై నెలలో ఖరీఫ్‌ పంటకాలంలో, వేసవి పంటగా జనవరి నెల నుండి ఫిబ్రవరి నెలలలో నాటుకోవాలి.

READ ALSO : Onion Cultivation : ఉల్లిసాగులో రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు

ఉల్లి సాగుకి అనుకూలమైన నేలలు ;

సారవంతమైన, నీరు నిలువని మెరక నేలలు ఉల్లిపంటకు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలువ ఉండే నేలలు, ఉప్పు, చౌడు, క్షారత్వం ఉన్న నేలలు ఉల్లిసాగుకి పనికిరావు. ఉదజని సూచిక 5.8 నుండి 6.5 ఉన్న నేలలు ఉల్లి సాగుకి అనుకూలమని చెప్పవచ్చు. ఎర్రనేలలు , ఎక్కువ సేంద్రియపదార్హం గల ఇసుకనేలలు ఉల్లిసాగుకి అనుకూలంగా ఉంటాయి. మురుగునీటి వసతి గల సారవంతమైన, నీరుపెట్టాల్సి రావటంతో పాటు త్వరగా ఉల్లిగడ్డ తయారవుతుంది.

ఉల్లి సాగులో అవసరమైన విత్తన మోతాదు, విత్తన శుద్ధి ;

ఒక ఎకరాకు 3 నుండి 4 కిలోల విత్తనాలు సరిపోతుంది. ఉల్లి సాగులో విత్తన శుద్దికి సంబంధించి ఆవు మూత్రం 2 లీటర్లు, పశువులపేడ 1 కిలో పుట్టమట్టి 1 కిలో, 150 గ్రాముల ఇంగువను 100 లీటర్ల నీటిలో కలిపి ఉల్లిగడ్దలను, ఉల్లిగడ్డ నారును ఆ ద్రావణంలో 15 నుండి 20 నిమిషాలు ముంచి ఆ తర్వాత నాటుకోవాలి. ఒక కిలో ఉల్లి విత్తనానికి 8 (గ్రాముల ట్రైకోడెర్మా కలిపి విత్తనశుద్ధి చేయాలి. విత్తుకునే ముందు విత్తనాలను జీవమృతంతో లేదంటే ఒక కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మవిరిడి లేదంటే 3 గ్రాముల తైరంతో విత్తన శుద్ది చేసుకున్నతరువాత మాత్రమే విత్తుకోవాలి.

READ ALSO : Onion Cultivation : ఖరీఫ్ ఉల్లిసాగులో మెళకువలు.. అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్యం

ఉల్లి సాగుకి నేల తయారీ ;

ఉల్లి పంట వెయ్యడానికి ముందునేలను దమ్ము చేసుకోవాలి. ఆఖరిగా దుక్కి అయిపోయాక భూమిని చిన్న, చిన్న మడులుగా విభజించాలి. నీరు పెట్టినప్పుడు నీరు నిల్వ ఉండకుండా నాలుగు మూలలు సమానంగా ఉండేలా మడులను తయారు చేయాలి. ఉల్లిపంటకు అనువైన నేలలు నల్లరేగడి, ఎ్యర నేలలు. ఉల్లిపంట వేయడానికి ఎంచుకున్న నేలలో ముందుగా పచ్చిరొట్ట, ఎరువు వేసి కలియదున్నుకోవాలి. ఎకరాకు 200 కిలోల ఘనజీవామృతం 2500 కిలోల నాడెప్‌ కంపోస్టు ఎరువులో కలిపి ఆఖరి దుక్కిలోవేసి కలియదున్నాలి. దుక్కి దున్నుతున్నపుడు వరిఊకను కాల్చినబూడిద ఎకరాకు 2 నుండి ౩ టన్నులు వేసుకుంటే ఉల్లిగడ్డ ఊరడానికి అవసరమైన భాస్వరం అందుతుంది. బోదెలు లేదా మడులు నీటిపారుదల వసతిని బట్టి కట్టుకోవాలి.

READ ALSO : Onion Farmers : ఉల్లి ధర పెరిగింది కానీ.. అయితే

6 అంగుళాల ఎత్తులో ఉల్లినారు పెంచడానికి ఎంచుకున్ననేలకు బెడ్డుల రూపంలో మట్టిని పోసుకుని బెడ్డుకి, బెడ్డుకి మధ్య కనీసం ఒక్క అడుగు దూరం అయినా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. సస్యరక్షణకు, కలుపు నివారణకు, నీరు అందించడానికి అనువుగా కాలినడక దారి ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు వేసుకునేముందు విత్తనాల మధ్య సమాన దూరాలు ఉండేలా గీతలు గీసుకొని గుర్తులు పెట్టుకుని విత్తనాలు విత్తుకోవాలి. కనిష్టంగా 3 నుండి గరిష్టంగా 4 కిలోల విత్తనాలు ఒక ఎకరానికి అవసరమవుతాయి.

ఉల్లిపంటకు చల్లని వాతావరణం అనుకూలం. ఈ పంట మంచును తట్టుకోలేదు. అధిక ఉష్పోగతలను కొంతవరకు తట్టుకోగలదు. ఉష్ణోగ్రత 15 నుండి 21 డి[గీ సెంటీగ్రేడ్గ వద్ద పైరు పెరుగుదలకు అనుకూలం. 27 డిగ్రీ సెంటీ గ్రేడ్డ కంటే ఉష్పోగ్రత పెరిగితే ఉల్లిగడ్డ పెరుగుదల లోపిస్తుంది. అందువల్ల సిఫార్సు చేసిన రకాలను ఆయా సీజన్లలో సాగుచేసుకుంటే అధిక దిగుబడులు పాందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు