Kharif Kandi Cultivation : ఖరీఫ్ కందిలో అధిక దిగుబడులకోసం మెళకువలు

తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్ పంటగా దీన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది.

Kharif Kandi Cultivation

Kharif Kandi Cultivation : అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను, అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో సాగవుతుంది . కందిని జూన్  నుంచి జులై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. మరీ ఆలస్యమైతే ఆగస్టు వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే అధిక దిగుబడులు పొందాలంటే మాత్రం సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నారు, వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌శాస్త్రవేత్త ఎన్‌.సంధ్య కిశోర్

READ ALSO : Cow Based Products : సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి గోశాల ఏర్పాటు.. గో ఆధారిత ఉత్పత్తుల తయారీ

తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగుచేస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్ పంటగా దీన్ని వర్షాధారంగా సాగుచేస్తారు. ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏకపంటగానే కాక పలు పంటల్లో అంతరపంటగా కూడా సాగుచేసుకునే అవకాశం వుంది. ఈ పంటలో ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా, మన రైతులు మాత్రం కేవలం ఐదు నుండి ఆరు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు.

READ ALSO : Cotton Cultivation : పత్తికి తొలిదశలో ఆశించే చీడపీడల నివారణ

ఇప్పటికే ఉన్న రకాలతో పాటు అధిక దిగుబడినిచ్చే రకాలు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని సకాలంలో విత్తడం ఒక ఎత్తైతే, సాగు యాజమాన్యం మరో ఎత్తు. కందిలో అధిక దిగుబడులు పొందాలంటే ఏఏ సమయంలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త, ఎన్‌.సంధ్యకిశోర్‌.

READ ALSO : Cabbage Cultivation : క్యాబేజి సాగులో మేలైన యాజమాన్యం.. మార్కెట్ కు అనుగుణంగా సాగుచేస్తే మంచి లాభాలు

కంది పూత, పింద దశలో చీడపీడలు ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుగులు రైతులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ పురుగుల వల్ల రైతుకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దాదాపు 80 శాతం దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం వుంది. దీనిపై ప్రత్యేక నిఘా వుండాలంటారు శాస్త్రవేత్త. సాధారణంగా కందిని వర్షాధారంగానే సాగుచేస్తారు. కీలక దశలైన పూత, కాత సమయంలో  బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అవకాశం ఉన్న వారు ఒకటి లేదా రెండు నీటి తడులను ఇచ్చినట్లైతే 20 శాతం అధిక దిగుబడిని పొందవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు