Palm Rosa Cultivation : మార్కెట్ లో గడ్డినూనెకు విపరీతమైన డిమాండ్.. పామారోజా సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న ప్రకాశం రైతు

విత్తనాలు నాటిన తర్వాత పెద్దగా ఖర్చు ఉండదు. పామారోజా గడ్డి ఆకులు, పువ్వుల నుండి స్టీమ్ డిస్టలేషన్ ద్వారా నునెను తీస్తారు. ఈ నూనె తీసే యంత్రంలో... డిస్టిలేషన్ ట్యాంకు, బాయిలర్, కండెన్సర్ , సపరేటర్ అనే భాగాలు ఉంటాయి.

Palm Rosa Cultivation : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా వారి వ్యవసాయ పద్ధతులలో మార్పులు చేసుకుంటున్నారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకుంటున్నారు. అదికూడా అతి తక్కువ పెట్టుబడితో పండే పంటలను ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు పామారోజా గడ్డిని సాగుచేస్తూ.. దాని నుండి వచ్చే ఆయిల్ అమ్ముతూ అధిక లాభాలను పొందుతున్నారు.

READ ALSO : Rugose white : కొబ్బరి, పామాయిల్‌ తోటల్లో రూగోస్‌ తెల్లదోమ నివారణ

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గడ్డిని చూడండీ… గడ్డే కదాని లైట్ తీసుకోకండి.. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న పామరోజా గడ్డి ఇది. దీని ఆకులు, పూవ్వుల నుంచి తీసి తైలం , సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ఔషద పరిశ్రమలలో దీన్ని విరివిగా వాడుతున్నారు. ఒకప్పుడు తెలుగురాష్ట్రాలలో దీని సాగు విస్తీర్ణం అధికంగా వుండేది. . కానీ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగటంతో రైతులు మార్కెటింగ్ ఇబ్బందులతో ఈ పంటకు దూరమయ్యారు.

ప్రస్తుతం అక్కడక్కడ కొంత మంది రైతులు సాగుచేస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే రైతు మేకల శివబాబు యాదవ్. ప్రకాశం జిల్లా, పుల్లల చెరువు మండలం, ఎండ్రపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు 20 ఎకరాల మెట్ట భూమిని కౌలుకు తీసుకొని పామరోజ సాగుచేశారు. ఆయిల్ తీసేందుకు పొలంలోనే సొంతంగా డిస్టిలేషన్ ఏర్పాటు చేసుకున్నారు.

విత్తనాలు నాటిన తర్వాత పెద్దగా ఖర్చు ఉండదు. పామారోజా గడ్డి ఆకులు, పువ్వుల నుండి స్టీమ్ డిస్టలేషన్ ద్వారా నునెను తీస్తారు. ఈ నూనె తీసే యంత్రంలో… డిస్టిలేషన్ ట్యాంకు, బాయిలర్, కండెన్సర్ , సపరేటర్ అనే భాగాలు ఉంటాయి. డిస్టిలేషన్ యంత్రంతో గడ్డిని ఉడికించడానికి, ముందు రోజు ఆయిల్ తీసిన గడ్డినే వంట చెరకుగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వంట చెరకు ఖర్చు మిగులుతోంది.

READ ALSO : Seed Quality : విత్తనం నాణ్యత, జన్యు స్వచ్చతపైన పంట దిగుబడులు.. రైతు స్థాయిలో విత్తనోత్పత్తికి సూచనలు

కోసిన గడ్డిని డిస్టలేషన్ ట్యాంక్ లోకి నింపి మూత పెట్టి, నీటి ఆవిరిని పంపాలి. నూనె ఆవిరి, నీటి ఆవిరి ద్రవరూపంలో కండెన్సర్ ద్వారా సపరేటర్ లోకి చేరుతాయి. నీటిపై తేలియాడే నూనెను వేరుచేసి శుభ్రపర్చి గాజులేక అల్యూమినియం పాత్రల్లో భద్రపర్చాలి. వచ్చిన ఆయిల్ ను లీటరు రూ. 2 వేల చొప్పున అమ్ముతున్నారు.

శివబాబు చేస్తున్న గడ్డిసాగు మరెంతో మందికి స్పూర్తిగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంపాటు దిగుబడి రావడంతో పామారోజా సాగును చుట్టుప్రక్కల కొంత మంది రైతులు ముందుకొస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు