Job Calendar : నిరుద్యోగులకు ఉగాది కానుక.. 10 వేలకు పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్.. ఇక ప్రిపరేషన్ ప్రారంభించండి..!

AP Job Calendar : నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉగాది కానుకగా 10 వేలకు పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది.

AP Government will release job calendar on ugadi 2026 with more than 10000 posts

AP Job Calendar : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఉగాది పండగ నాడు వారికి కానుక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఉగాది నాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని.. ప్రతి ఏటా దీన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ ఉగాది పండగ నాడు ప్రకటించబోయే జాబ్ క్యాలెండర్‌పై ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. పలు విభాగాల్లో కలిపి మొత్తం 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని.. రానున్న మూడేళ్లలో ప్రాధాన్యక్రమంలో వాటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది పండగకి మొత్తం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జాబ్ క్యాలెండర్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం మార్చి 13న సచివాలయంలో అన్ని విభాగాల అధిపతులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. మొత్తం 10,060 ఉద్యోగాల్లో పలు శాఖల వారీగా ఉన్న ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

  • పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌లో కలిపి 3 వేలు,
  • విశ్వవిద్యాలయాల్లో 1500 అసిస్టెండ్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
  • ఎస్సై, కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 3వేలు,
  • ఏఈ పోస్టులు 500,
  • సంక్షేమ వసతిగృహాల వార్డెన్లు 200,
  • అటవీశాఖ పోస్టులు 100,
  • స్టాటిస్టిక్స్‌ అధికారి పోస్టులు 200,
  • గ్రూపు-1లో 100,
  • గ్రూపు-2లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే దానిపై ఒక స్పష్టత రానుంది అంటున్నారు.