AP Government: జగనన్న కాలనీల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. నచ్చకపోతే స్థలాలు క్యాన్సిల్.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్(AP Government)లోని జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఒక అతిముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Ap govt to issue notice to beneficiaries of jagananna colonies on plot allotment
AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని జగనన్న కాలనీలలో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు సంబంధించి చంద్రబాబు నాయుడు(AP Government) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక అతిముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ప్లాట్లలో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవడం ఇష్టం లేని లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలలో స్థలాలు కేటాయించే అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఈ విషయంలో లబ్ధిదారుల స్పష్టమైన అభిప్రాయాన్ని సేకరించడానికి వారికి త్వరలోనే అధికారిక నోటీసులు పంపనున్నట్లు వెల్లడించారు.
UPI MDR Charges: యూపీఐ లావాదేవీలపై ఊరట.. ఎండీఆర్ ఛార్జీల అమలు వాయిదా?.. వ్యాపారులకు బిగ్ రిలీఫ్!
మంత్రుల కమిటీ ఏర్పాటు.. వద్దనుకున్న స్థలాల రిజిస్ట్రేషన్లు రద్దు:
ఈ సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు గృహనిర్మాణ మంత్రి పార్థసారథి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్‌లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. గతంలో కేటాయించిన కాలనీల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల చాలామంది అక్కడ ఇళ్లు కట్టడానికి వెనుకాడుతున్నారని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, లబ్ధిదారులు వద్దనుకున్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లను తక్షణమే రద్దు చేసి, వాటిని అర్హులైన ఇతర పేదలకు పునఃకేటాయించాలని స్పష్టం చేశారు.
భూసేకరణ వేగవంతం.. గత ప్రభుత్వ భూకుంభకోణంపై విచారణకు ఆదేశం:
ఇటీవల నిర్వహించిన ‘ఆవాస్’ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అవసరమని తేలడంతో, వారి కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల సేకరణ పేరుతో జరిగిన భారీ అక్రమాలు, అక్రమ లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించడంతో ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది.
