AP Liquor Shops: లిక్కర్ షాపులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఇకపై రెన్యువల్ గడువు పొడిగింపు ఉండదు
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఏ4 మద్యం (AP Excise Department) షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది.
AP Liquor shop license renewal deadline expired and new gazette notification update soon
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్లో 2026–27 ఎక్సైజ్ సంవత్సరానికి సంబంధించి ఏ4 మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ అధికారికంగా ముగిసింది. ఎక్సైజ్ శాఖ నిర్ణయం ప్రకారం ఇకపై రెన్యువల్ గడువును పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిర్దేశిత సమయం ముగిసేసరికి రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ మొత్తాన్ని 100 శాతం చెల్లించిన షాపులను మాత్రమే రెన్యువల్కు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన 3,650 షాపుల్లో 3,236 షాపులు రెన్యువల్కు రాగా, అందులో 2,873 షాపులు పూర్తిస్థాయి చెల్లింపులు పూర్తి చేయడం గమనార్హం. ఓవరాల్గా 88.7 శాతం షాపులు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి.
Read Also – Telangana Rains: తెలంగాణలో మారిపోయిన వాతావరణం.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
జిల్లాల వారీగా చెల్లింపుల సరళి – అగ్రస్థానంలో తూర్పుగోదావరి:
రెన్యువల్ ట్యాక్స్ చెల్లింపుల్లో జిల్లాల వారీగా వ్యత్యాసాలు కనిపించాయి. తూర్పుగోదావరి జిల్లా అత్యధికంగా 97.1 శాతం చెల్లింపులతో అగ్రస్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా 94.7 శాతం, శ్రీ సత్యసాయి జిల్లా 91.8 శాతంతో తదుపరి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు గుంటూరు (64.5%), బాపట్ల (68.8%), విశాఖపట్నం (69%) జిల్లాల్లో చెల్లింపుల శాతం అత్యల్పంగా నమోదైంది. చెల్లింపులు పూర్తయిన తర్వాత మిగిలిన షాపుల వివరాలను లెక్కించి తదుపరి చర్యలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.
నూతన గెజిట్ నోటిఫికేషన్ – అక్టోబర్ 3న డ్రా ద్వారా కేటాయింపులు:
రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన ఏ4 షాపులతో పాటు ఇదివరకు నోటిఫై చేయని షాపులకు కొత్త లైసెన్సుల కేటాయింపు కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నూతన దరఖాస్తుల సమర్పణకు అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు సమయం ఇచ్చారు. అనంతరం అక్టోబర్ 2న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అక్టోబర్ 3వ తేదీన లాటరీ (డ్రా) పద్ధతి ద్వారా ఏ4 మద్యం షాపులను అర్హులకు కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
