AP Local Body Elections 2026 : జనసేనకు నాలుగు.. బీజేపీకి రెండు కార్పొరేషన్లు.. స్థానిక ఎన్నికల్లో కూటమి సీట్లపై క్లారిటీ.. పార్టీల వారిగా లిస్ట్ ఇదే..
AP Local Body Elections 2026 : రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 11 చోట్ల టీడీపీ, 4 చోట్ల జనసేన, 2 చోట్ల బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించారు.
AP Local Body Elections 2026
AP Local Body Elections 2026 : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన, బీజేపీ నేతలు సుదీర్ఘ చర్చల అనంతరం ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీ చేసే స్థానాలపై కూటమి నేతల మధ్య స్పష్టత వచ్చింది.
Also Read : AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ గౌరవవేతనాల కింద రూ.22.50కోట్లు విడుదల
రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 11 చోట్ల టీడీపీ, 4 చోట్ల జనసేన, 2 చోట్ల బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించారు. ఇందులో శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లను జనసేనకు కేటాయించారు. రాజమహేంద్రవరం, అనంతపురం కార్పొరేషన్లలో బీజేపీ పోటీ చేయనుంది.
106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి 78 చోట్ల టీడీపీ, 21 చోట్ల జనసేన, 7 చోట్ల బీజేపీ పోటీ చేయాలని కూటమి నేతలు నిర్ణయించారు. స్థానికంగా ఆయా పార్టీలకు ఉన్న బలం, రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల కేటాయింపులు చేసినట్లు తెలుస్తోంది.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో టీడీపీ 89 చోట్ల, జనసేన 25 చోట్ల, బీజేపీ 9 చోట్ల పోటీ చేయనున్నాయి. ఈ లెక్కల ప్రకారం టీడీపీకి 72.36 శాతం, జనసేనకు 20.33 శాతం, బీజేపీకి 7.32 శాతం స్థానాలు కేటాయించినట్లు సమాచారం.

