AP PGCET-2022: ఏపీ పీజీసెట్- 2022 నోటిఫికేషన్‌ రిలీజ్

ఆంధ్రప్రదేశ్‌లోని 16 యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

AP PGCET-2022: ఏపీ పీజీసెట్- 2022 నోటిఫికేషన్‌ రిలీజ్

Pg Cet 2022

Updated On : June 23, 2022 / 8:17 AM IST

AP PGCET-2022: ఆంధ్రప్రదేశ్‌లోని 16 యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు యోగివేమన వర్సిటీ వీసీ సూర్యకళావతి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మొత్తం 145 కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు జులై 20 చివరి తేదీ కాగా, ఆగస్టు 17 నుంచి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ చివరి సెమిస్టరులో ఉన్నవారు సైతం ఏపీపీజీసెట్-2022 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జులై 20వ తేదీగా నిర్ణయించామన్నారు. రూ.500 ఆలస్య రుసుంతో జులై 27వ తేదీ వరకు అలానే రూ.1000 ఆలస్య రుసుంతో జులై 29వ తేదీ వరకు గడువు ఉందన్నారు.

Read Also : ఐఎంయూ సెట్ 2022 ప్రవేశాలకు దరఖాస్తులు

దరఖాస్తు రుసుం ఓసీ అభ్యర్థులకు రూ.850, బిసి అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.650 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు ఆగస్టు 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సౌకర్యార్ధం హైదరాబాద్‌ లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.