Free Bus Travel: ఫ్రీ బస్ స్కీమ్.. మహిళలకు మరో గుడ్ న్యూస్..! జిరాక్స్, సాఫ్ట్ కాపీలకు అనుమతి..! ఇకపై ఆ రూట్లలోనూ ఉచిత ప్రయాణం..
ఈ నెల 18 నుంచి పని దినాలు కావడంతో మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. (Free Bus Travel)

Free Bus Travel: స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత బస్సు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు వెల్లడించింది.
ఉచిత బస్సు పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు.
గడిచిన 30 గంటల్లో ఆర్టీసీ బస్సుల్లో 12 లక్షల మందికి పైగా మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.
పథకం తొలి రోజు ఉచిత బస్సు ప్రయాణాలతో రూ.5 కోట్ల మేర మహిళలు ఆదా చేసుకున్నట్లు వివరించారు.(Free Bus Travel)
ఆ రూట్లలో ఉచిత ప్రయాణానికి అనుమతి..!
ఇక మహిళా ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఘాట్ రూట్లలోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
కాగా, రద్దీని దృష్టిలో పెట్టుకుని ఘాట్ రూట్లలో ఉచిత ప్రయాణానికి గతంలో ఆర్టీసీ అనుమతించలేదు. తాజాగా సీఎం ఆదేశాలతో ఇప్పుడు ఘాట్ రూట్‌లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.(Free Bus Travel)
ఎల్లుండి నుంచి మరింత రద్దీ పెరిగే అవకాశం..
ఈ నెల 18 నుంచి పని దినాలు కావడంతో మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎల్లుండి నుంచి బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. (Free Bus Travel)
ఆధార్ కార్డుతో సహా స్థానికతను నిర్దేశించే ఇతర ధృవీకరణ కార్డులను అనుమతించనుంది ప్రభుత్వం.
జిరాక్స్, సాఫ్ట్ కాపీలకు అనుమతి..!
స్త్రీ శక్తి స్కీమ్ అమల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఆధార్ ఒరిజినల్ తో పాటు జిరాక్స్ కాపీ, ఫోన్ లో సాఫ్ట్ కాపీని కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
స్త్రీశక్తి పథకంపై మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. జీరో ఫేర్ టికెట్ తో సంతోషం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నారు మహిళలు.
Also Read: మహిళల కోసం గేమ్ ఛేంజర్‌లాంటి పథకాలు.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?
ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న స్త్రీ శక్తి స్కీమ్ ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ పథకం కింద 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో (పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్) మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ స్కీమ్ తో ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల భారం పడనుంది.