AP Job Calendar 2026: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్.. వీరికి మాత్రమే.. రెడీ అవ్వండి..
AP Second Job Calendar : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది.
AP Second Job Calendar 2026 Notification 15 August 3168 Posts
- ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త
- భారీగా పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్
- అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు
AP Second Job Calendar : ఏపీలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చేసి.. భారీగా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికితోడు ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టిసారించింది.
Also Read: 14న భౌమవతి అమావాస్య.. ఈ పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ పోతాయ్.. వారికి అద్భుత అవకాశం..
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత జాబ్ క్యాలెండర్ విడుదలకు కసరత్తు ప్రారంభించింది. పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న రెండో విడత జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
అమరావతిలోని సచివాలయంలో సీఎస్ సాయిప్రసాద్ ముఖ్య కార్యదర్శులు, శాఖ కార్యదర్శులు, శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, స్థానిక క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోస్టుల కేటాయింపు, రిజర్వేషన్ రోస్టర్ అమలు, ఏపీపీఎస్సీతో పాటు ఇతర నియామక సంస్థలకు ఖాళీల వివరాల పంపిణీ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో స్నేహపూర్వకంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. అలాగే క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన పెండింగ్ కేసులను వచ్చే ఆరు నెలల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. రెండో విడత జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన నోటిఫికేషన్లు ఆగస్టు 15న విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 3,168 పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో 91 గ్రూప్-1 పోస్టులు కూడా ఉన్నాయని సమాచారం. త్వరలోనే రెండో విడత ఉద్యోగ నియామాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌పై క్లారిటీ వస్తుందంటున్నారు.
ఇదిలాఉంటే.. ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా 10,060 పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఉగాది కానుకగా ప్రకటించిన ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా వివిధ శాఖలు, విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. మిగిలిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విడుదల కానున్నాయి. అయితే, రెండో విడత నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
