Nara Bhuvaneswari : శభాష్ నిత్య శ్రీ.. ఇలానే దూసుకెళ్లు.. బాలికపై నారా భువనేశ్వరి ప్రశంసలు.. ఎందుకంటే..
Nara Bhuvaneswari : నిత్యశ్రీ అనే బాలికపై నారా భువనేశ్వరి ప్రశంసల వర్షం కురిపించారు.
- Dharani Pilli
- Updated on- May 1, 2026 / 02:22 PM IST
AP SSC Results 2026 nara bhuvaneswari appreciates 10th topper nithya sri who got 597 marks out off 600
- ఏపీ పదో తరగతి ఫలితాల్లో నిత్యశ్రీ రికార్డ్
- 600 మార్కులకు గాను 597
- ప్రశంసించిన నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి, నిత్యశ్రీ అనే బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. భవిష్యత్తులో కూడా ఇలానే దూసుకెళ్లాలని ఆశీర్వదించారు. ఇంతకూ అసలేం జరిగింది అంటే.. గురువారం విడుదలైన ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో నిత్యశ్రీ 600 మార్కులకు గాను ఏకంగా 597 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. పైగా ఈ బాలిక చదివింది చల్లపల్లిలోని NTR హైస్కూల్‌లో. ఈ క్రమంలో నారా భువనేశ్వరి నిత్యశ్రీని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ క్రమంలో నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా నిత్యశ్రీని ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. పదో తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించిన నిత్యశ్రీ, చల్లపల్లిలోని ఎన్టీఆర్ హైస్కూల్‌లో చదవడం ఎంతో గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
గురువారం వెల్లడించిన పదో తరగతి ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పోయిన సంవత్సరం 81.1 శాతంగా ఉన్న ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది 85.25 శాతానికి పెరగడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. పదో తరగతి ఫలితాల్లో అబ్బాయిలతో పోలిస్తే.. అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 5.22 శాతం అధికంగా ఉండటం హర్షనీయం అన్నారు. అలానే ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 72.8 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈ ఏడాది 78.39 శాతానికి పెరగడం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
