AP Jobs Notification: ఏపీ నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్.. గ్రూప్-1 సహా 892 పోస్టులకు నోటిఫికేషన్లు.. దరఖాస్తు తేదీలు ఇవే!
ఆంధ్రప్రదేశ్(AP Jobs Notification)లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) బిగ్ అప్డేట్ ఇచ్చింది.
APPSC released notification for Group-1 and 892 posts.
- గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది
- మొత్తం 163 పోస్టుల భర్తీ
- దరఖాస్తులు అక్టోబర్ 6 నుండి
AP Jobs Notification: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తూ ఉద్యోగార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తాజాగా పలు శాఖల్లో ఖాళీల భర్తీతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 పోస్టుల భర్తీకి కూడా అధికారిక ప్రకటన వెలువరించింది.
19 శాఖల్లో 729 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శ్రీకారం:
ఏపీపీఎస్సీ(AP Jobs Notification) రాష్ట్రంలోని 19 విభిన్న శాఖలలో వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 729 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి విద్యా అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలను ఏపీపీఎస్సీ తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకొని దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ సూచించింది.
గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. 163 పోస్టులకు అవకాశం:
మరోవైపు నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మొత్తం 163 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన ఇచ్చింది. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించారు. ఇందులో ముఖ్యంగా 11 డిప్యూటీ కలెక్టర్, 36 డీఎస్పీ (సివిల్), 35 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, 14 అసిస్టెంట్ కమిషనర్ (ట్యాక్స్), 15 డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులతో పాటు పలు కీలక విభాగాలు ఉన్నాయి.
