APSDMA Weather Alert : ఏపీలో విభిన్నమైన వాతావరణం.. ఓ వైపు ఎండలు.. మరో వైపు పిడుగులతో వర్షాలు.. 3 రోజులు ఇదే పరిస్థితి

APSDMA Weather Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపించబోతుందని ప్రకటించింది.

APSDMA alert light to moderate rain thunderstorms and sunny conditions in andhra pradesh from march 18 to 20

APSDMA Weather Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజులు విభిన్నమైన వాతావరణం ఉండబోతుందంటున్నారు. రాగల మూడు రోజులు ఏపీలో ఓ వైపు ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొనబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ద్రోణి, నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో గురువారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది.

అలానే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ఆకస్మిక వర్షాలతో పడే పిడుగుపాటుపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.