YS Jagan : వైఎస్ జగన్‌తో బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష భేటీ..
YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బొత్స అనూష బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
YS Jagan
YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలను అప్పగించినందుకు జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని.. క్షేత్ర స్థాయిలో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేస్తానని అనూష చెప్పారు.
Also Read : Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ ఎనిమిదేళ్ల ప్రస్థానం.. ఎక్స్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ఇటీవలే వైసీపీని వీడిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన కుమార్తెతో కలిసి టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటన విడుల చేసింది. కాగా.. మంగళవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, తాను అన్నివిధాలుగా అండగా ఉంటానని బొత్స అనూషకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
