స్థానిక సమరానికి సిద్ధమైన కూటమి.. చంద్రబాబు-పవన్ కీలక భేటీ.. మేయర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

Chandrababu Naidu and Pawan Kalyan crucial meeting regarding seat-sharing for AP local body elections.

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో మునుపెన్నడూ లేని విధంగా కూటమి పొత్తును మరింత బలోపేతం చేసే దిశగా సీఎం నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీకి ముందు చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ అల్పాహార విందులో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై దాదాపు రెండు గంటల పాటు ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

Indrakeeladri: ఇంద్రకీలాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. దసరా ఉత్సవాల టికెట్లు విడుదల.. ‘మన మిత్ర’ యాప్‌తో సులభ దర్శనం!

స్థానాల సర్దుబాటు, మేయర్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్:

ఈ కీలక సమావేశంలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య స్థానాల సర్దుబాటు( AP Local Body Elections), ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే అంశాలపై ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా కీలకమైన మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్ అభ్యర్థుల ఎంపిక, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కేటాయింపులపై లోతుగా చర్చించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే క్షేత్రస్థాయిలో ఎలాంటి గందరగోళం లేకుండా సంయుక్తంగా ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

కూటమి ఐక్యతతో విజయం సాధించడమే లక్ష్యం:

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటుతూ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అన్ని స్థాయిల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా నాయకులు వ్యూహరచన చేశారు. జిల్లాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, టికెట్ల కేటాయింపులో ఎలాంటి అసంతృప్తులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ విజయం దిశగా ముందుకు సాగాలని ఈ భేటీ ద్వారా తీర్మానించారు.