Brother Anil Kumar : ‘బ్రదర్ అనిల్‌తో సమావేశమై బాధను విన్నవించుకున్నాం’
విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీసీ మైనారిటీ క్రిష్టియన్ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన బ్రదర్ అనిల్‌తో చర్చించి మా సమస్యలను వినిపించామని అన్నారు.
- Subhan Ali Shaik
- Published On : March 7, 2022 / 04:17 PM IST
Brother Anil Kumar
Brother Anil Kumar: విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీసీ మైనారిటీ క్రిష్టియన్ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఆ కార్యక్రమానికి విచ్చేసిన బ్రదర్ అనిల్‌తో చర్చించి మా సమస్యలను వినిపించామని అన్నారు. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ సంఘం నాయకులు శోంఠి నాగరాజు కామెంట్స్ ఇలా ఉన్నాయి.
‘వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేం సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం. అప్పట్లో బ్రదర్ అనిల్ మాతో సమావేశాల్లో పాల్గొని చెప్పడం వల్లే వైసీపీకి ఓటు వేసి గెలిపించాం’
‘మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని బ్రదర్ అనిల్‌కు తెలియజేశాం’
Read Also : వైఎస్ షర్మిల పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు
‘మేం చెప్పిన దానికి పూర్తిగా విని సానుకూలంగా స్పందించి తగు నిర్ణయం తీసుకుంటా’మని బ్రదర్ అనిల్ చెప్పారు.
