AP Cabinet Meeting: నేడు (మే 8) ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపనుంది క్యాబినెట్. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపనుంది మంత్రివర్గం. పలు సంస్థలకు భూకేటాయింపులపై ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాల అమలుపై కేబినెట్ లో చర్చించనున్నారు.
Also Read: భూ ఆక్రమణలు నిజమేనా? తిరుపతిలో సంచలనం రేపుతున్న బుగ్గ మఠం భూముల రీసర్వే..
ప్రధాని మోదీ సభ విజయవంతంపై మంత్రులతో సీఎం చంద్రబాబు డిస్కస్ చేయనున్నారు. ఇక భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు, దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే ఛాన్స్ ఉందని సమాచారం. అలాగే తీర ప్రాంత భద్రత పైనా ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది.