AP Rains : దక్షిణకోస్తాపై ‘మురసు తుపాను’ పంజా.. రానున్న 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు!
AP Rains: దక్షిణకోస్తాంధ్రపై మురసు తుపాను(Cyclone Murasu) ప్రభావంతో రానున్న 3 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Cyclone murasu alert heavy rainfall warning for ap coastal districts
Cyclone Murasu AP Rains బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్రత దక్షిణ కోస్తాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. దీని ప్రభావంతో రానున్న మూడు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అత్యవసర ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు తీవ్ర అప్రమత్తత ప్రకటించారు.
Kadapa Election Results: జగన్ కోటలో కూటమి ప్రభంజనం.. కడపలో ఏకంగా 4 మున్సిపాలిటీల్లో జయకేతనం
గంటకు 6 కిమీ వేగంతో తుపాను ప్రయాణం.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం:
గడిచిన ఆరు గంటలుగా ఈ తుపాను గంటకు 6 కిలోమీటర్ల నెమ్మది వేగంతో కదులుతూ ప్రస్తుతం బాపట్లకు 40 కి.మీ, ఒంగోలుకు 50, విజయవాడకు 90, కావలికి 110, మచిలీపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. మురసు క్రమంగా ముందుకు సాగుతూ తుపానుగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ రాత్రి నుంచి తీరం వెంట వీస్తున్న ఈదురుగాలుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రజలకు అధికారుల తీవ్ర హెచ్చరికలు.. వాగులు, వంకలు దాటే యత్నం చేయొద్దు:
మరోవైపు మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్ష తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో లేదా తమ ఇళ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, కల్వర్టులను దాటేందుకు ఎలాంటి సాహసాలు చేయవద్దని, అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
