AP Rains : ఏపీకి మరో ముప్పు.. దూసుకొస్తున్న తుపాన్.. ఈ జిల్లాల్లో నేడు భీకర గాలులతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ
AP Rains : దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకొని ఉన్న నికోబార్ దీవులపై కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడే చాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Andhra Pradesh
AP Rains : ఏపీలో మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. ఇప్పటికే అర్నబ్ తుపాను కారణంగా పలు జిల్లాల్లో భీకరగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల దాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ వర్షాల ముప్పు ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read : AP Local Body Elections : ముగిసిన ఎన్నికల ప్రచారం.. నవంబర్ 1న మున్సిపల్ ఎన్నికలు.. పోలింగ్‌కు సర్వం సిద్ధం!
దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకొని ఉన్న నికోబార్ దీవులపై కేంద్రీకృతమైన అల్పపీడనం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తరువాత రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఏపీ తీరం వైపు కదిలే చాన్స్ ఉందని, దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
శనివారం (31-10-2026) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు సైతం కురిసే చాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాలతోపాటు తీవ్ర స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంచనా వేశారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, పెద్దపెద్ద హోర్డింగ్స్ ఉన్న ప్రాంతాల్లో వేచిఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులకు సూచించారు.
మరోవైపు.. శుక్రవారం ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6గంటల సమయం వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నగరంలో 91.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 81.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా చోడవరంలో 80.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
