School Holidays : ఏపీలోని విద్యార్థులకు ఊహించని గుడ్న్యూస్.. మళ్లీ నాలుగు రోజులు సెలవులు..? ఎలా అంటే..
School Holidays : ఏపీలోని విద్యార్థులకు మరో గుడ్ న్యూస్. మళ్లీ వరుసగా నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయి.
- Harish Thanniru
- Updated on- October 21, 2026 / 09:19 AM IST
School Holidays
School Holidays : ఏపీలోని పాఠశాలలకు దసరా పండుగ సెలువులు ముగిశాయి. అక్టోబర్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఏపీ విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెలవులు పూర్తికావడంతో గురువారం (22వ తేదీ) నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయి. అయితే, విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. మళ్లీ వరుసగా నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయి.
Also Read : Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ వరకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.. కారణమిదే..
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 28న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల భవనాలను పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగిస్తారు. పోలింగ్ నిర్వహణ కోసం బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంలు, సిబ్బంది ఒకరోజు ముందే అక్కడికి చేరుకుంటారు. దీంతో పోలింగ్ కు ముందు రోజు అక్టోబర్ 27, పోలింగ్ రోజు అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ కేంద్రాలుగా మారిన పాఠశాలలకు స్థానికంగా సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
అక్టోబర్ 17న వెలువడిన జీవో నంబర్ 1285 ప్రకారం.. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులను బట్టి సెలవులు ప్రకటించే పూర్తి అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. పోలింగ్ కేంద్రాలుగా ఎంపికైన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ రెండు రోజుల పాటు తప్పనిసరిగా ప్రత్యేక సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో వరుసగా నాలుగు రోజులు ఏపీలోని విద్యా సంస్థలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది.
అక్టోబర్ 25వ తేదీన ఆదివారం.. సాధారణంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. అక్టోబర్ 26వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి పండుగ ఉంది. ఈ కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల నిర్ణయం ఆధారంగా అక్టోబర్ 26న సెలవు ఉంటుందా? ఉండదా? అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఇక 27, 28 తేదీల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నేపథ్యంలో పలు పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 12రోజుల పాటు దసరా సెలవుల్లో ఎంజాయ్ చేసిన విద్యార్థులకు మళ్లీ వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం కనిపిస్తుంది.
