AP Govt : ఏపీలో స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.. మొత్తం 87రోజులు సెలవులు.. ఫార్మెటివ్ పరీక్షలు ఇలా..
AP Govt : ఏపీలోని పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ను సిద్ధం చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో స్కూళ్లకు మొత్తం 87రోజులు సెలవులు రానున్నాయి.
school students in Andhra Pradesh
- ఏపీలో స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త
- స్కూల్స్ 2026-27 అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది
- వచ్చే విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 87 సెలవులు
AP Govt : ఏపీలోని స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ప్రస్తుతం స్కూళ్లకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభం అవుతాయి. 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే, ఈ విద్యా సంవత్సరంలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. విద్యార్థులకు భారీ మొత్తంలో సెలవులు రాబోతున్నాయి. విద్యా సంవత్సరంలో మొత్తం 316 రోజులకుగాను 229 రోజులు పనిదినాలు.. 87 సెలవులు ఉంటాయి.
Also Read : Weather Update : గుడ్న్యూస్.. మే నెలలోనే వచ్చేస్తున్నాయ్.. ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు..
ఏపీలోని పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ను సిద్ధం చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో స్కూళ్లకు మొత్తం 87రోజులు సెలవులు రానున్నాయి. ఆప్షనల్ సెలవులు ఐదు, స్థానిక పండుగలు, జాతరలకు ఇచ్చే లోకల్ సెలవులు మూడు ఉంటాయి. మొత్తం 229 రోజులు మాత్రమే పాఠశాలలు ఓపెన్ ఉంటాయి.
2026-27 విద్యా సంవత్సరంలో అకడమిక్ క్యాలెండర్ను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. ఇందుకోసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించింది. వారి సలహాలు, సచనల స్వీకరించింది. తద్వారా అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించింది.
సెలవులు ఇలా..
♦ అక్టోబర్ 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు రానున్నాయి. అయితే, మైనార్టీ స్కూళ్లకు మాత్రం అక్టోబర్ 15 నుంచి ఇస్తారు.
♦ క్రిస్మస్ సెలవులు మైనారిటీ విద్యా సంస్థలకు డిసెంబర్ 20 నుంచి 27వ తేదీ వరకు ఇస్తారు. సాధారణ స్కూళ్లకు డిసెంబర్ 25 ఒక్క రోజు సెలవు ఇస్తారు.
♦ సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఇస్తారు. అయితే, మైనారిటీ విద్యా సంస్థలకు జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సెలువులు ఉంటాయి.
ఫార్మెటివ్ పరీక్షలు ఇలా..
♦ ఆగస్టు 3 నుంచి 6వ తేదీ వరకు ఫార్మెటివ్ 1 పరీక్షలు ఉంటాయి.
♦ అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు ఫార్మెటివ్ 2 పరీక్షలు నిర్వహిస్తారు
♦ నవంబరు 9 నుంచి 20 వరకు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు.
♦ జనవరి 4 నుంచి 7 వరకు ఫార్మెటివ్ 3 పరీక్షలు నిర్వహిస్తారు.
♦ 2027 ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు ఫార్మెటివ్ 4 పరీక్షలు నిర్వహిస్తారు.
♦ 2027 ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు.
♦ 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9వరకు పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్, తొమ్మిదో తరగతికి సమ్మెటివ్-2 పరీక్షలు ఉంటాయి.
♦ 2027 ఏప్రిల్ 3 నుంచి 17 వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు సమ్మెటివ్-2 పరీక్షలు ఉంటాయి.
♦ 2027 మార్చి 15 నుంచి 31 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు.
