Ap Rains: ఏపీకి మ‌రో వాయుగుండం ముప్పు.. మరోసారి భారీ వర్ష హెచ్చరిక.. కోస్తాంధ్ర, రాయలసీమకు తుఫాను గండం?

ఆంధ్రప్రదేశ్(Ap Rains) రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మళ్లీ గణనీయమైన మార్పులు సంభవించడం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Heavy rain forecast for Andhra Pradesh due to a low-pressure in Bay of Bengal

Ap Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మళ్లీ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో త్వరలోనే నూతనంగా ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు(Ap Rains) కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం తీవ్రమై అల్పపీడనంగా రూపాంతరం చెందుతోందని అధికారులు తెలిపారు. పగటిపూట ఉక్కపోత సాధారణంగా ఉన్నప్పటికీ, సాయంత్రం వేళల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

Chandrababu Naidu: పేదల సంక్షేమం కోసం కీలక నిర్ణయం.. వారికి శాశ్వత ఇళ్ల స్థలాలు.. ఏపీ కేబినెట్ ఆమోదం

తీవ్ర వాయుగుండంగా మారే ప్రమాదం.. కోస్తాంధ్ర, తమిళనాడు దిశగా పయనం:

బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం క్రమంగా మరింత బలపడి రానున్న మూడు నుంచి నాలుగు రోజుల్లో తీవ్రమైన వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇది ప్రధానంగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల దిశగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మత్స్యకారులు, రైతులకు అలర్ట్.. విపత్తు నిర్వహణ సంస్థ జాగ్రత్తలు:

ఈ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వేటలో ఉన్నవారు తక్షణమే తీరానికి తిరిగొ రావాలని అధికారులు ఆదేశించారు. కోత దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షాల తీవ్రతను బట్టి అధికారిక సమాచారాన్ని నిరంతరం గమనిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.