Andhra Pradesh: మనుషుల అక్రమ రవాణాపై చైతన్యం కోసం ప్రపంచంతో పాటు కదిలిన వందల మంది

దేశవ్యాప్తంగానూ ఈ వాక్ లో పాల్గొన్నవారు దీన్ని ప్రారంభించడానికి ముందు, తమ జీవితకాలం ఈ అక్రమ రవాణాని ముగించడానికి తమకున్న అవకాశాల మేరకు అన్నిరకాలుగా వీలైనంత సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Human Trafficking: ఆధునికకాల బానిసత్వానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో 500 పైగా ప్రాంతాల్లో, దేశంలోని 100కు పైగా ఇతర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో పెద్దఎత్తున నిర్వహించిన వాక్ లో వేలాది మంది ఇతరులతో వాళ్ళూ పాల్గొన్నారు. మానవ అక్రమ రవాణా గురించి చైతన్యాన్ని పెంచేందుకు చిత్తూరులో ఈ ఉదయం నిర్వహించిన “వాక్ ఫర్ ఫ్రీడం”లో దుర్బల సమూహాల నుంచి, అలాగే లాభాపేక్ష లేని సంస్థల నుంచి 335 మంది పౌరులు పాల్గొన్నారు.

ఎస్ఐ శ్రీనివాసులు, వైఎస్ఆర్‪సిపి పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపిటిసి మధు, ఆర్‪హెడ్స్ ఎన్‪జిఒ డైరెక్టర్ థియో స్టీపెన్స్, సెయింట్ స్టీఫెన్స్ స్కూల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ “మన సమాజంలో జరుగుతున్న వాటి అన్నింటి గురించి మనం అందరం బాగా తెలుసుకుని వుండాల్సిన అవసరం వుంది. ఎందుకంటే, ఈ కాలంలో మనుషుల్ని సులువుగా అమ్మేస్తున్నారు. పౌరులందరూ చైతన్యంతో వున్నప్పుడే ఈ నేరాన్ని అరికట్టడానికి వీలవుతుంది. అలాటి చైతన్యానికి దోహదం చేసే వాక్ ఫర్ ఫ్రీడం వంటి ఉద్యమంలో భాగం కావడం నాకు గర్వంగా వుంది” అని అన్నారు.

చిత్తూరులోను, దేశవ్యాప్తంగానూ ఈ వాక్ లో పాల్గొన్నవారు దీన్ని ప్రారంభించడానికి ముందు, తమ జీవితకాలం ఈ అక్రమ రవాణాని ముగించడానికి తమకున్న అవకాశాల మేరకు అన్నిరకాలుగా వీలైనంత సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం, మానవ అక్రమ రవాణా గురించి సమాచారం, గణాంకాలతో వున్న సింగిల్ ఫైల్ ప్లేకార్డ్స్ పట్టుకుని, ఐరాల అంబేద్కర్ విగ్రహం నుంచి బయల్దేరి అందరికీ కనిపించేలా రోడ్ల మీదుగా తిరిగి అక్కడికే చేరుకున్నారు. మానవ అక్రమ రవాణాలో మౌన బాధితులకి సంఘీభావంగా ఈ వాక్ పూర్తిగా నిశ్శబ్ధ నడకగా సాగింది.