Nellore: లేడీ డాన్‌.. ఆమె వస్తే మ్యాటర్‌ సెటిల్..! ఎస్పీలు, ఆ పై అధికారులు ఎవరైనా ఆమె చెప్తే వినాల్సిందే.. ఏం చేస్తోందంటే?

Nellore: గతంలో ఆమె ఒక పార్టీకి అనుకూలంగా ఉండగా.. ఇప్పుడు అధికారంలో ఉన్న మరో పార్టీ నాయకులతో అంట కాగడం సంచలనం సృష్టిస్తోంది.

Nellore: లేడీ డాన్‌.. ఆమె వస్తే మ్యాటర్‌ సెటిల్..! ఎస్పీలు, ఆ పై అధికారులు ఎవరైనా ఆమె చెప్తే వినాల్సిందే.. ఏం చేస్తోందంటే?

Updated On : August 18, 2025 / 8:46 PM IST

Nellore: ఆమె ఒక లేడీ డాన్. ఒక్క మాటలో చెప్పాలంటే లేడీ నయీం అన్నా తక్కువే. గుడ్‌ లుకింగ్. హైప్రొఫైల్. అంతకు మించి మెయింటెనెన్స్. తియ్యని మాటలు..వినకపోతే ధమ్కీలు. మ్యాటర్ ఏదైనా ఆమె దిగిందంటే అంతే సంగతులు. ఏ ఆఫీసర్‌ను అయినా ఇలానే పట్టేస్తుంది. అలా పనిచేయించేస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో ఇన్వాల్వ్‌ మెంట్‌, యూత్ గ్యాంగ్‌తో సెటిల్‌మెంట్‌, ఉన్నతాధికారుల పేర్లు చెబుతూ పైరవీలు..ఇలా హైప్రొఫైల్ లేడీగా..ఓ గ్యాంగ్‌నే ఏర్పాటు చేసుకుందట నెల్లూరు (Nellore) లేడీ డాన్.

ఏకంగా స్టేట్‌ సెక్రటేరియట్‌లోనే కూర్చుని హల్‌చల్‌ చేసే స్థాయికి ఎదిగిందంటున్నారు. నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో పుట్టిన ఆమె ఇప్పుడు తెలుగు స్టేట్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారారు. అతిపెద్ద అధికారులతో పనిచేయిస్తా అంటూ ఫోన్లు చేసి బేరాలు ఆడటమే కాదు..నెల్లూరు జిల్లాలో ఆ మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, క్రిమినల్స్ లేరట. తప్పుడు పనులు వద్దని వారించిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆమె భర్త మృతి కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి బదిలీ అయ్యారట. గతంలో ఒక ఎస్సీతో కలిసి ఆమె గోవా ట్రిప్పుకు వెళ్లిందట.

Also Read: Shubhanshu Shukla: మోదీని కలిసి మర్చిపోలేని గిఫ్టుని ఇచ్చిన శుభాంశు శుక్లా

అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ మహిళ వైసీపీ ప్రభుత్వంలో దిశతో ఎక్కడికో ఎదిగిపోయిందట. నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్ చేసుకుని, పోలీసు పరిచయాలు పెంచుకుని..గత ప్రభుత్వంలో కొందరు పెద్దల్ని కలిసి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుందట. ఆమె ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో కూర్చుని..మీకు ఏం కావాలో చెప్పండి. నేను చెబితే మీ ఎస్పీ చేయాల్సిందే. అన్నీ నేను చూసుకుంటా అంటూ సీఐలు, ఎస్ఐలనే కమాండ్ చేసేదట.

దిశ యాప్‌ ప్రచారకర్తగా

దిశ యాప్‌ను అస్త్రంగా చేసుకుని పోలీసులతో పరిచయాలు పెంచుకుందట. దిశ యాప్‌ ప్రచారకర్తగా పోలీసుల చుట్టూ తిరిగిందట. ఇదే క్రమంలో..రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీసులనే ఆటాడుకుంటూ సెటిల్‌మెంట్‌ చేస్తుందని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసులు చెబుతున్నారు. గంజాయి బిజినెస్ నడుపుతోందన్న ప్రచారం ఉంది. తనను తాను ఓ స్వచ్చంద సంస్థ కార్యదర్శిగా పరిచయం చేసుకుంటూ దందాలు చేసేవారట.

ఓ హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ ఇప్పించటంలో ఆమెదే కీలకపాత్రని టాక్. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో సదరు ఖైదీ పెరోల్ రద్దయిందంటున్నారు. ఓ వైన్ షాప్ మేనేజర్‌ హత్య కేసు నిందితుడిగా ఉన్న వ్యక్తికి పెరోల్ ఇవ్వొద్దని ఇద్దరు ఎస్పీలు, నెల్లూరు జైల్ సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపినా..మేడమ్‌ చక్రం తిప్పి మరీ పెరోల్ మంజూరు చేయించారట. అయితే ఈ ఇష్యూ వెలుగులోకి రావడంతో ఏపీ సీఎంవో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆసుపత్రిలో ఓ రౌడీ షీటర్‌తో ఈ లేడీ డాన్ రాసలీల వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో అటు పోలీసుల పనితీరుపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. పోలీసులు మాత్రమే కాదు..ఏకంగా గత సర్కార్‌లో పనిచేసిన మంత్రులు, సెక్రటేరియట్‌లో ఉన్నతాధికారులతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయట.

గతంలో ఆమె ఒక పార్టీకి అనుకూలంగా ఉండగా.. ఇప్పుడు అధికారంలో ఉన్న మరో పార్టీ నాయకులతో అంట కాగడం సంచలనం సృష్టిస్తోంది. దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైలులో ఉన్న వ్యక్తి పేరుతో ఆమె నేరాలు చేస్తున్నారని..ఒక ముఠాను కూడా మెయింటెన్‌ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇంత జరిగిన తర్వాత..మీడియా ద్వారా విషయం వెలుగులోకి వచ్చాక..ఆమెపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.