Yellamma Temple: పొట్టేలుకు బదులు మనిషి తల నరికిన మందుబాబు

ఎల్లమ్మ గుడిలో బలి ఇచ్చేందుకు సిద్ధమైన సమయంలో మనిషి తలను నరికేయడం కలకలం రేపింది. చిత్తూరులోని మదనపల్లెలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెలో,,

Goat Head

Yellamma Temple: ఎల్లమ్మ గుడిలో బలి ఇచ్చేందుకు సిద్ధమైన సమయంలో మనిషి తలను నరికేయడం కలకలం రేపింది. చిత్తూరులోని మదనపల్లెలో జరిగిన దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెలోని వలసపల్లి ఎల్లమ్మగుడిలో ఆదివారం రాత్రి జరిగిన కనుమ వేడుకల్లో భాగంగా జాతర జరిగింది.

ఈ క్రమంలో ఎల్లమ్మ తల్లికి మొక్కుబడుల నిమిత్తం బలి ఇచ్చేందుకు పొట్టేలును తీసుకొచ్చారు. పొట్టేలిని నరికేందుకు చలపతి ముందుకురాగా పొట్టేలును సురేష్ పట్టుకున్నాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న చలపతి.. పొట్టేలు తలకు బదులు దానిని పట్టుకున్న వ్యక్తి తలను నరికేశాడు.

హుటాహుటిన మదనపల్లె ఆసుపత్రి తరలించి చికిత్స మొదలుపెట్టారు. గాయం తీవ్రంగా కావడంతో హాస్పిటల్ లో చేరిన కాసేపటికే మృతిచెందినట్లు వైద్యులు తేల్చారు. మద్యం మత్తులోనే ఇలా చేశాడా లేక పాత కక్షల నేపథ్యంలో ఇలా జరిగిందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి : నేను బ్యాంకాక్ బీచ్ లో స్క్రిప్ట్ రాయను