అల్లు అర్జున్ కామెడీ యాక్టర్‌.. హీరో కాదు‌: విరుచుకుపడ్డ జనసేన పార్టీ నాయకులు

అల్లు అర్జున్ కామెడీ యాక్టర్‌లా కనబడుతున్నారని, హీరోలా కనబడడం లేదని.. జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్ కామెడీ యాక్టర్‌.. హీరో కాదు‌: విరుచుకుపడ్డ జనసేన పార్టీ నాయకులు

Janasena Leaders sensational comments on Allu Arjun

Janasena Leaders on Allu Arjun: హీరో అల్లు అర్జున్‌పై జనసేన పార్టీ నాయకుల విమర్శలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నిన్న హాట్ కామెంట్స్ చేయగా.. ఈరోజు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కామెడీ యాక్టర్ అంటూ సెటైర్లు వేశారు. తమ నియోజకవర్గంలో పుష్ఫ 2 సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

అల్లు అర్జున్ కామెడీ యాక్టర్‌: చలమలశెట్టి
తామంతా చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తుంటే.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ హీనంగా ప్రవర్తిస్తున్నారని చలమలశెట్టి రమేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గన్నవరం నియోజకవర్గంలో పుష్ప2 సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ కామెడీ యాక్టర్‌లా కనబడుతున్నారని, హీరోలా కనబడడం లేదన్నారు. హీరో అంటే రాంచరణ్ అని, అతడిని చూసి నేర్చుకోవాలని సూచించారు. పిల్లికి బిచ్చం పెట్టని అల్లు అరవింద్ ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా అంటూ ప్రశ్నించారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ కాళ్లు కడిగి ఆ నీళ్లను పబ్లిగ్గా మీడియా ముందు నెత్తిన చల్లుకుంటేనే అల్లు అర్జున్‌ మాట్లాడిన మాటలకు ప్రక్షాళన జరుగుతుందన్నారు.

అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నారా?
అల్లు అర్జున్ స్థాయి మరచి మాట్లాడుతున్నారని, చిరంజీవి వల్లే అతడికి గుర్తింపు దక్కిందని బొలిశెట్టి శ్రీనివాస్ నిన్న వ్యాఖ్యానించారు. తన తండ్రి అల్లు అరవింద్ ఎంపీగా నిలబడితే గెలిపించలేని అల్లు అర్జున్.. ఇతరులను వేలెత్తి చూపడం సరికాదని అన్నారు. అల్లు అర్జున్ ప్రచారానికి వస్తే.. రాకపోతే ఎంత అంటూ తీసిపారేశారు. తనకు మెగా ఫ్యాన్స్ మాత్రమే తెలుసని, అల్లు అర్జున్‌కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారా అంటూ సెటైర్లు వేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన ఈరోజు వివరణ ఇచ్చారు.

Also Read: అందుకే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణ చెప్పా.. తాడిపత్రి రూరల్ సీఐ క్లారిటీ

మళ్లీ మాట్లాడితే కౌంటరిస్తా
అల్లు అర్జున్‌తో తనకుగానీ, తమ పార్టీకి గానీ ఎటువంటి శత్రుత్వం లేదని.. బన్నీ మాటలతోనే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అల్లు అర్జున్‌ మళ్లీ ఇలాగే మాట్లాడితే కౌంటర్ ఇస్తానని ఎమ్మెల్యే శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇటీవల మూవీ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తన అభిమానులను ఉద్దేశిస్తూ తనకు ఇష్టమైతేనే వస్తానని బన్నీ చేసిన వ్యాఖ్యలతో అల్లు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌పై ఎమ్మెల్యే శ్రీనివాస్, చలమలశెట్టి రమేష్ విమర్శలు చేశారు.