Kodali Nani: రాజీనామా తర్వాత కొడాలి నాని రియాక్షన్
ఏపీ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ సీఎం జగన్ చెప్తే ఏ పని చేయడానికైనా ఉన్నానని కొడాలి నాని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు
- Subhan Ali Shaik
- Published On : April 7, 2022 / 05:59 PM IST
Kodali Nani
Kodali Nani: ఏపీ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ సీఎం జగన్ చెప్తే ఏ పని చేయడానికైనా ఉన్నానని కొడాలి నాని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన స్టైల్లో కామెంట్ చేస్తూ.. కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని.. అందరి లాగే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు.
మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో కొందరికి స్థానం ఉంటుందని చెప్పిన నాని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా కొడాలి నానికి కొత్త మంత్రివర్గంలో స్థానముంటుందా? అనే ప్రశ్నకు.. కొడాలి నానికి నాలుగు కొమ్ములేమీ లేవని, కొత్త కేబినెట్‌లో తన స్థానంపై అవకాశాలు తక్కువేనని స్పష్టం చేశారు.
Read Also: పని చేయకుంటే పదవుల్లేవ్..!
‘సీఎం ఆదేశాల మేరకు కేబినెట్ భేటీలో మంత్రివర్గంలోని అందరం రాజీనామా చేశాం. ఏప్రిల్ 11న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుంద’ని జగన్ చెప్పారన్నారు.
ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు రాజీనామా చేస్తుంటే.. జగన్ ఎక్కువగా బాధపడినట్టుగా కనిపించిందని, తాము ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని, మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా నాని వ్యాఖ్యానించారు.
‘అనుభవం రీత్యా కొంతమంది మంత్రులను కొనసాగిస్తామని సీఎం చెప్పారు. ఎవరిని కొనసాగిస్తున్నారో ఇంకా తెలీదు. ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటాం’ అని కొడాలి కీలక వ్యాఖ్యలు చేశారు.
