Gudivada Amarnath : తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు..

 తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.

Gudivada Amarnath : తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు..

Gudivada Amarnath

Pawan Kalyan.. Gudivada Amarnath : తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఓటమిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. జనసేన బర్రెలక్కతో కూడా పోటీపడలేకపోయిందని..కనీసం డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు..ఏపీకి సంబంధమేంటీ..?ఆయన ఇల్లు తెలంగాణలో ఉంటుంది..కానీ ఇక్కడ పోటీ చేస్తానంటారు…పవన్ కళ్యాణ్ ది ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గమో చెప్పండి… అంటూ ప్రశ్నించారు.

పవన్ తెలంగాణలో బీజేపిని నాశనం చేశారు అంటూ ఆరోపించారు.పొలిటికల్ కాంట్రాక్టులు కోసం పుట్టిన పార్టీ జనసేన అంటూ ఎద్దేవా చేశారు.విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని ఏ కేంద్ర మంత్రి చెప్పారు..? అని ప్రశ్నించారు.తెలంగాణలో జనసేనాకు ఏ ఫలితాలు వచ్చాయో..ఏపీలో కూడా అవే ఫలితాలు వస్తాయని అన్నారు.

బండ్ల గణేష్ కు ఉన్న ఆలోచన..సిద్ధాంతాలుకూడా పవన్ లేవని విమర్శించారు.2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయన్నారు.ఉద్ధానం కిడ్ని సమస్యపై మేము పరిష్కారం చూపించామన్నారు.నాదేండ్ల మనోహర్ మరో కట్టప్ప…ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ ను కత్తితో పోడుస్తాడంటూ విమర్శించారు.అత్తారింటికి దారేదో..పవన్ కళ్యాణ్ కు తెలియాలి అంటూ ఎద్దేవా చేశారు.